- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rohit Sharma: రోహిత్ రిటైర్‌మెంట్.. టీమిండియా కొత్త కెప్టెన్ ఎవరు?
టెస్టులకు రోహిత్ సడెన్‌గా వీడ్కోలు పలికాడు. అతని స్థానంలో టెస్టు జట్టును నడిపించే సారధిని వెతికే పనిలో బీసీసీఐ పడింది.

దిశ, స్పోర్ట్స్: రోహిత్ శర్మ రిటైర్ అవడంతో ఇంగ్లండ్‌లో టీమిండియాకు ఎవరు సారధ్యం వహిస్తారనే చర్చ జోరందుకుంది. స్టార్ ప్లేయర్లు కేఎల్ రాహుల్, జస్‌ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్, శుభ్‌మన్ గిల్ పేర్లు కెప్టెన్సీ రేసులో వినిపిస్తున్నాయి. వీరిలో రాహుల్, బుమ్రా ఇద్దరూ గతంలో భారత జట్టుకు సారధ్యం వహించారు. బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీసులో కెప్టెన్‌గా రాహుల్ ఆకట్టుకున్నాడు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రెండు టెస్టులకు సారధ్యం వహించిన బుమ్రా కూడా తనలో అద్భుతమైన సారధి ఉన్నాడని నిరూపించుకున్నాడు. గిల్, పంత్ ఇప్పటి వరకు టెస్టుల్లో సారధ్య బాధ్యతలు నిర్వర్తించలేదు. టీ20 ఫార్మాట్లో కెప్టెన్సీ చేసి ఫర్వాలేదనిపించారు. అయితే ఇంగ్లండ్ సిరీస్‌తో కొత్త డబ్ల్యూటీసీ సైకిల్ ప్రారంభం అవనుంది. ఈ క్రమంలో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కుర్రాళ్లకే కెప్టెన్సీ ఇవ్వాలని బీసీసీఐ సెలెక్టర్లు అనుకుంటున్నారట.
బీసీసీఐ వర్గాల ప్రకారం, ఇంగ్లండ్ సిరీసులో టీమిండియా టెస్టు పగ్గాలను శుభ్‌మన్ గిల్‌కు అందజేయనున్నట్లు సమాచారం. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో కూడా గిల్ సారధ్యంలోని గుజరాత్ టైటాన్స్ అద్భుతంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. గుజరాత్‌ను టేబుల్ టాపర్‌గా నిలబెట్టడంలో గిల్ కెప్టెన్సీకి కూడా మంచి మార్కులే పడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఇంగ్లండ్ సిరీసులో భారత టెస్టు టీం కెప్టెన్‌గా గిల్‌కు అవకాశం ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోందట.






