- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చివర్లో రాణించిన భారత బౌలర్లు.. ఆస్ట్రేలియా స్కోర్ ఎంత అంటే..?
భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య టీ20 సిరీస్ ఉత్కంఠగా కొనసాగుతోంది. ఈ సిరీస్ లో భాగంగా మూడో టీ20 మ్యాచ్ హోబార్డ్ వేదికగా జరుగుతుంది.

దిశ, వెబ్ డెస్క్: భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య టీ20 సిరీస్ ఉత్కంఠగా కొనసాగుతోంది. ఈ సిరీస్ లో భాగంగా మూడో టీ20 మ్యాచ్ హోబార్డ్ వేదికగా జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన ఆ భారత జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియాకు అర్షదీప్ సింగ్ ఊహించని షాక్ ఇచ్చి రెండు వికెట్లను పడగొట్టాడు. కానీ ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన టీమ్ డేవిడ్.. ఫోర్లు, సిక్సర్లతో రెచ్చిపోయాడు. 5 సిక్సర్లు, 8 ఫోర్లతో 74 పరుగులు చేశాడు. అలాగే ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ 8 ఫోర్లు 2 సిక్సర్లతో 64 పరుగులు చేశాడు. దీంతో ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 186 పరుగుల స్కోరు చేసింది. ఈ మ్యాచులో భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ 3, వరుణ్ చక్రవర్తి 2, సివబ్ దుబే 1 వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచులో భారత్ గెలావాలంటే నిర్ణీత 20 ఓవర్లలో 187 పరుగులు చేయాల్సి ఉంది. మరీ ఈ మ్యాచులో భారత్ గెలిచి సిరీస్ ను 1-1 సమం చేస్తుందా లేదా తెలియాలంటే వేచి చూడాల్సిందే.






