యువ రెజ్లర్ నేహాపై వేటు.. ఆ కారణంతో రెండేళ్లు సస్పెండ్

by Harish |

భారత మహిళా రెజ్లర్ నేహా సాంగ్వాన్‌ను సోమవారం భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ) రెండేళ్లు సస్పెండ్ చేసింది.

యువ రెజ్లర్ నేహాపై వేటు.. ఆ కారణంతో రెండేళ్లు సస్పెండ్
X

దిశ, స్పోర్ట్స్ : భారత మహిళా రెజ్లర్ నేహా సాంగ్వాన్‌ను సోమవారం భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ) రెండేళ్లు సస్పెండ్ చేసింది. 59 కేజీల కేటగిరీలో పోటీ పడే ఆమె తరుచుగా బరువు నిర్వహణలో విఫలమవుతున్న కారణంగా వేటు వేసింది. అంతేకాకుండా, వచ్చే నెలలో జరిగే సీనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్ స్క్వాడ్ నుంచి కూడా తప్పించింది. ఆమె స్థానంలో సారిక మాలిక్‌ను తీసుకుంది. ఆమె వరల్డ్ చాంపియన్‌షిప్ ట్రయల్స్‌లో రెండో స్థానంలో నిలిచింది. సెప్టెంబర్ 13 నుంచి 21 వరకు వరల్డ్ చాంపియన్‌షిప్ జరగనుంది. ఇటీవల బల్గేరియాలో జరిగిన అండర్-20 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో నేహా అధిక బరువు కారణంగా డిస్‌క్వాలిఫై అయ్యింది. అర్హత బరువు కంటే 600 గ్రాములు ఎక్కువగా ఉంది. నేహా తరుచుగా బరువు నిర్వహణలో ఇబ్బంది పడుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘బరువు నిర్వహణ రెజ్లర్ చూసుకోవాల్సిన విషయం. బల్గేరియాలో 59 కేజీల కేటగిరీలో మేము పతకాన్ని కోల్పోయాం. మాకు కూడా బాధ్యత ఉంది. టోర్నమెంట్ కోసం ప్రభుత్వం నిధులు ఇస్తుంది. ఒక్క రెజ్లర్‌పై 2-3 లక్షలు ఖర్చు చేస్తుంది. బరువును చూసుకోకపోతే మరో ఉత్తమమైన రెజ్లర్‌కు అవకాశం ఇస్తాం.’అని డబ్ల్యూఎఫ్ఐ తెలిపింది.


Next Story