టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. ఇద్దరు సీమర్లతో బరిలోకి భారత్

by Kema Shiva Kumar |

రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా స్వదేశంలో టీమిండియా (Team India), వెస్టిండీస్ (West Indies) జట్టుతో తలపడబోతోంది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. ఇద్దరు సీమర్లతో బరిలోకి భారత్
X

దిశ, వెబ్‌డెస్క్: రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా స్వదేశంలో టీమిండియా (Team India), వెస్టిండీస్ (West Indies) జట్టుతో తలపడబోతోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతోన్న తొలి టెస్ట్‌లో విండీస్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలోనే ఇద్దరు ప్రధాన సీమర్లు జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్‌తో టీమ్‌ఇండియా బరిలోకి దిగబోతోంది. ఈ సిరీస్‌ను 2-0తో గెలిచి వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో పాయింట్ల పట్టికలో అగ్ర స్థానానికి చేరేందుకు భారత్ ఉవ్విళ్లూరుతోంది.

భారత జట్టు: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్‌ గిల్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీశ్‌ కుమార్ రెడ్డి, కుల్‌దీప్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్.

వెస్టిండీస్ జట్టు: టాగెనరైన్ చందర్‌పాల్, జాన్ కాంప్‌బెల్, అలిక్ అథనాజ్, బ్రాండన్ కింగ్, షాయ్ హోప్(వికెట్ కీపర్), రోస్టన్ చేజ్(కెప్టెన్), జస్టిన్ గ్రీవ్స్, జోమెల్ వారికన్, ఖరీ పియరీ, జోహన్ లేన్, జేడెన్ సీల్స్.

Next Story