- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
T20 World Cup 2026: బోణీ కొట్టిన వెస్టిండీస్
టీ20 ప్రపంచ కప్ 2026లో వెస్టిండీస్ జట్టు బోణీ కొట్టింది.

దిశ, వెబ్‌డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026లో వెస్టిండీస్(West Indies) జట్టు బోణీ కొట్టింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా స్కాట్లాండ్(Scotland)తో జరిగిన తొలి మ్యాచ్‌లో 35 పరుగుల తేడాతో వెస్టిండీస్ గెలిచింది. గెలుపు కోసం స్కాట్లాండ్ జట్టు తీవ్రంగా శ్రమించి విఫలమయ్యారు. 183 పరుగుల లక్ష్యఛేదనలో స్కాట్లాండ్ తడబడి 147 (18.5 ఓవర్లు) పరుగులకు ఆలౌటైంది. బెర్రింగ్‌టన్ (42), బ్రూస్(35) ఫర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. వెస్టిండీస్ బౌలర్లలో షెపర్డ్ హ్యాట్రిక్ సహా 5 వికెట్లు తీశాడు. హోల్డర్ 2 వికెట్లు పడగొట్టగా.. జోసెఫ్, మోటీ తలో వికెట్ తీశారు. అంతకు ముందు వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. హెట్ మేయర్(64), బ్రాండన్ కింగ్ (35), రూథర్‌ఫోర్డ్ (26), పావెల్ (24), హోప్ (19), షెపర్డ్(6), మ్యాథ్యూ(1) పరుగులు చేశారు. స్కాట్లాండ్ బౌలర్లలో బ్రాడ్ 2 వికెట్లు తీయగా.. షరీఫ్, డేవిడ్సన్, లీస్క్ తలో వికెట్ పడగొట్టారు.






