జింబాబ్వే కంటే దారుణం...వెస్టిండీస్ చేతిలో చిత్తుగా ఓడిన పాకిస్తాన్.. 34 ఏళ్ల తర్వాత

by velandi.Saikiran |

పాకిస్తాన్ ను చిత్తు చేసిన వెస్టిండీస్... 34 సంవత్సరాల తర్వాత వన్డే సిరీస్ కైవసం చేసుకుంది.

జింబాబ్వే కంటే దారుణం...వెస్టిండీస్ చేతిలో చిత్తుగా ఓడిన పాకిస్తాన్.. 34 ఏళ్ల తర్వాత
X

దిశ, వెబ్ డెస్క్: ప్రత్యర్థి పాకిస్తాన్ ఆర్థికంగానే కాదు... క్రికెట్ పరంగా కూడా ప్రమాదంలో పడుతోంది. మొన్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సమయంలో అత్యంత చెత్త ప్రదర్శన కనబరిచిన పాకిస్తాన్.. ఈ సంవత్సరం... అదే బాటలో నడుస్తోంది. తాజాగా వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్ కూడా కోల్పోయింది పాకిస్తాన్. పాకిస్తాన్ ను చిత్తు చేసిన వెస్టిండీస్... 34 సంవత్సరాల తర్వాత వన్డే సిరీస్ కైవసం చేసుకుంది.

పాక్ తో స్వదేశంలో నిన్నటి వరకు వన్డే సిరీస్ ఆడింది వెస్టిండీస్. అయితే ఈ వన్డే సిరీస్ లో మొదట జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ గెలువగా... రెండు అలాగే మూడో వన్డే మ్యాచ్లో వెస్టిండీస్ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో 2-1 తేడాతో వెస్టిండీస్ గ్రాండ్ విక్టరీ కొట్టింది.

మూడవ వన్డే మ్యాచ్ లో వెస్టిండీస్ ఏకంగా 294 పరుగులు చేసింది. అయితే ఆ లక్ష్యాన్ని చేదించే క్రమంలో పాకిస్తాన్ 92 పరుగులకే ఆల్ అవుట్ అయింది. దీంతో 202 పరుగుల భారీ తేడాతో పాకిస్తాన్ పై వెస్టిండీస్ విజయం సాధించింది. దీంతో 34 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్పై వన్డే సిరీస్ గెల్చుకుంది వెస్టిండీస్. ఇక అంతకుముందు టి20 సిరీస్ పార్క్ దక్కించుకున్న సంగతి తెలిసిందే.

Next Story