- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తొలి గంటలోనే ఆలౌట్ చేస్తాం.. భారత్‌కు ఇంగ్లాండ్ అసిస్టెంట్ కోచ్ సవాల్
భారత్ - ఇంగ్లాండ్ (India-England) మధ్య లార్డ్స్ (Lords) వేదికగా జరగుతోన్న మూడో టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా కొనసాగుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: భారత్ - ఇంగ్లాండ్ (India-England) మధ్య లార్డ్స్ (Lords) వేదికగా జరగుతోన్న మూడో టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ అసిస్టెంట్ కోచ్ మార్కస్ ట్రెస్కోథిక్ (Marcus Trescothick) భారత్ జట్టుకు సంచలన సవాల్ విసిరాడు. ఐదో రోజు ఆట ప్రారంభమైన తొలి గంటలోనే టీమిండియాను ఆలౌట్ చేస్తామని కామెంట్ చేశాడు. అయితే, భారత విజయ లక్ష్యం 193 పరుగులు కాగా.. చివరి రోజు ఆట ముగిసే జట్టు 4 కీలక వికెట్లను కోల్పోయి 58 పరుగులు చేసింది. ఇంకా విజయానికి 135 పరుగులు అవసరం ఉన్నాయి. క్రీజ్‌లో కేఎల్ రాహుల్ (KL Rahul) ఒక్కడే 33 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. నైట్ వాచ్‌మెన్‌గా వచ్చిన ఆకాశ్ దీప్ (Akashdeep) ఒకే ఒక్క పరుగు చేసి వెనుదిరిగాడు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ అసిస్టెంట్ కోచ్ మర్కాస్ ట్రెస్కోథిక్ మీడియాతో మాట్లాడుతూ.. నాలుగు రోజు ఆట చివరి గంట అద్భుతంగా మారిందని అన్నారు. అందరూ మ్యాచ్‌లో లీనమయ్యారని.. ప్రేక్షకులు ఇరు జట్లకు మద్దతు ఇచ్చారని తెలిపారు. ఐదురోజు ఆట ప్రారంభం కాగానే భారత్ ఆలౌట్ చేసేందుకు ప్రయత్నిస్తామని.. భారత్ ఎంత సానుకూలంగా ఆడుతుంది, ఎంత ఆధిపత్యం చూపిస్తుందనేది కీలకమని మార్కస్ ట్రెస్కోథిక్ అన్నారు.






