- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విరాటో కోహ్లీ ముందు బాబర్ దేనికి పనికిరాడు..పాక్ క్రికెటర్ సంచలనం !
విరాట్ కోహ్లీ పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ స్పందించారు.

దిశ, వెబ్ డెస్క్: జనవరి 18వ తేదీన న్యూజిలాండ్ చేతిలో భారత జట్టు మూడో వన్డే ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ విరోచిత పోరాటం చేశాడు. కానీ చివరలో విరాట్ కోహ్లీ ఔట్ కావడంతో పరిస్థితి చేయి దాటిపోయింది. దీంతో వన్డే సిరీస్ కోల్పోయింది భారత జట్టు. అయితే న్యూజిలాండ్ తో జరిగిన చివరి వన్డేలో విరాట్ కోహ్లీ స్లోగా బ్యాటింగ్ చేశాడని కొంతమంది విమర్శలు చేస్తున్నారు. అతని స్లో బ్యాటింగ్ కారణంగా ఇండియా ఓడిపోయిందని అంటున్నారు.
విరాట్ కోహ్లీ పై ప్రశంసలు
విరాట్ కోహ్లీ పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ స్పందించారు. వన్డే క్రికెట్ లో ఈ ఏజ్ లో కూడా విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడుతున్నాడని కొనియాడారు. బ్యాటర్లందరూ చేతులెత్తేశాక, విరాట్ కోహ్లీ ఒక్కడు ఎంతలా పోరాడతాడు ? అంటూ నిలదీశారు వసీం అక్రమ్. భారత జట్టుకు తన వంతు పాత్రను విరాట్ కోహ్లీ పోషించాడని ప్రశంసించారు. బాబర్ ను విరాట్ కోహ్లీతో చాలామంది పోల్చుతారు... కానీ ఇదంతా ఫేక్ అన్నారు. కోహ్లీ ముందు దేనికి బాబర్ పనికిరాడు అంటూ విమర్శలు చేశారు వసీం అక్రమ్.






