- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాకిస్తాన్‌కు షాకిచ్చిన విండీస్.. 35 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై కరేబియన్ జట్టు సంచలనం
పాకిస్తాన్ గడ్డపై వెస్టిండీస్ చారిత్రాత్మక విజయం సాధించింది.

దిశ, స్పోర్ట్స్ : పాకిస్తాన్ గడ్డపై వెస్టిండీస్ చారిత్రాత్మక విజయం సాధించింది. రెండో టెస్టులో పాక్‌ను ఓడించడం ద్వారా పాక్ గడ్డపై 35 ఏళ్ల తర్వాత ఓ టెస్టు మ్యాచ్‌లో విజయాన్ని అందుకుంది. గతంలో 1990లో పాక్‌లో కరేబియన్ జట్టు విజయం సాధించింది. ముల్తాన్‌లో సోమవారం ముగిసిన మ్యాచ్‌లో విండీస్ 120 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో విండీస్ 163 రన్స్ చేయగా.. పాక్ 154 స్కోరు చేసిన విషయం తెలిసిందే. ఇక, రెండో ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 244 స్కోరు చేసి పాక్ ముందు 254 పరుగుల లక్ష్యం పెట్టింది. జొమెల్ వర్రికన్(5/27) విజృంభించడంతో ఛేదనలో పాక్ తేలిపోయింది. 133 పరుగులకే ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 76/4తో ఆట కొనసాగించిన పాక్ మరో 57 పరుగులే చేసి 6 వికెట్లు కోల్పోయింది. బాబర్ ఆజామ్(31) టాప్ స్కోరర్. ఆఖరి 6 వికెట్లలో నాలుగు వికెట్లు వర్రికన్ ఖాతాలోనే చేరాయి. మూడు రోజుల్లోనే ముగిసిన రెండో టెస్టులో 36 వికెట్లు పేసర్లే తీయడం విశేషం. సిరీస్‌లో 19 వికెట్లుతో టాప్ వికెట్ టేకర్‌గా నిలిచిన వర్రికన్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.






