ఐదు వికెట్లతో చెలరేగిన రిష్యంత్.. 2-డేస్ లీగ్‌లో మెరిసిన వరంగల్ కుర్రాడు

by Phanindra |

హైదరాబాద్ వేదికగా జరుగుతున్న 2 డేస్ లీగ్ చాంపియన్‌షిప్‌లో వరంగల్ కుర్రాడు రిష్యంత్ మెరిశాడు. ఐదు వికెట్లతో చెలరేగి తన జట్టును మెరుగైన స్థితిలో నిలిపాడు.

ఐదు వికెట్లతో చెలరేగిన రిష్యంత్.. 2-డేస్ లీగ్‌లో మెరిసిన వరంగల్ కుర్రాడు
X

దిశ, స్పోర్ట్స్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న 2-డేస్ లీగ్‌ ఛాంపియన్‌షిప్‌లో వరంగల్ కుర్రాడు పంతగాని రిష్యంత్ తన స్పిన్ మాయాజాలంతో చెలరేగాడు. హైదరాబాద్‌లోని 7టి క్రికెట్ ఎరీనా గ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్ మొదటి రోజే ఐదు వికెట్లతో మెరిశాడు. మంగళవారం నాడు జరిగిన బి-డివిజన్‌ మ్యాచులో అవర్స్, వరలంగల్ జిల్లా జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అవర్స్ జట్టు.. రిష్యంత్ దెబ్బకు కేవలం 108 పరుగులకే ఆలౌట్ అయింది.

మొత్తం 11.2 ఓవర్లు బౌలింగ్ చేసిన రిష్యంత్.. 19 పరుగులే ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు. ఐదు మెయిడిన్ ఓవర్లతో 1.68 ఎకానమీతో చెలరేగాడు. అనంతరం బ్యాటింగ్ వచ్చిన వరంగల్ జిల్లా టీం తొలిరోజు ఆట ముగిసే సమయానికి 17 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 42 పరుగులు చేసింది. రిష్యంత్ బౌలింగ్ చూసిన అందరూ అతన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇలాగే రాణిస్తే రిష్యంత్ భవిష్యత్తులో ఐపీఎల్, టీమిండియాకు ఆడే స్థాయికి ఎదుగుతాడని స్నేహితులు చెప్తున్నారు.

Next Story