- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గంభీర్ ఇండియాకు.. టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌కు భారత జట్టు సన్నద్ధమవుతోంది.

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌కు భారత జట్టు సన్నద్ధమవుతోంది. ఈ నెల 20 నుంచి తొలి టెస్టు ప్రారంభంకానుంది. అయితే, ప్రతిష్టాత్మక సిరీస్‌లో పలు మ్యాచ్‌లకు భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సేవలను కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. గంభీర్ శనివారం ఇండియాకు వచ్చాడు. రెండు రోజుల క్రితం గంభీర్ తల్లికి గుండెపోటు వచ్చింది. ఢిల్లీలోని గంగారాం హాస్పిటల్ ఆమె ప్రస్తుతం కోలుకుంటుంది. తన తల్లిని చూసేందుకు గంభీర్ ఇంగ్లాండ్ నుంచి స్వదేశానికి తిరిగివచ్చాడు. అతను ఎప్పుడు తిరిగి ఇంగ్లాండ్ వెళ్తాడని తెలియదు. ఈ నేపథ్యంలో నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ) చైర్మన్ వీవీఎస్ లక్ష్మణ్ భారత జట్టుకు కోచ్‌గా వ్యవహరించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం లక్ష్మణ్ ఇంగ్లాండ్‌లోనే ఉన్నాడు. భారత అండర్-19, ఏ జట్లకు హెడ్ కోచ్‌గా సేవలందిస్తున్నాడు. దీంతో గంభీర్ వచ్చేవరకు సీనియర్ జట్టుకు లక్ష్మణ్ మార్గనిర్దేశం చేయనున్నాడు. గతంలో లక్ష్మణ్ పలుమార్లు టీమిండియాకు తాత్కాలికంగా హెడ్ కోచ్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే, గంభీర్ తొలి టెస్టు నాటికి జట్టుతో కలిసే అవకాశం ఉన్నట్టు సంబంధిత వర్గాల సమాచారం.






