- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిన్నస్వామిలో ‘విరాట్’ మెరుపులు: లక్నోపై ఆర్సీబీ ఘన విజయం
ఐపీఎల్ 2026లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అద్భుత విజయం సాధించింది.

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్-2026లో భాగంగా ఇవాళ రాత్రి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అద్భుత విజయాన్ని అందుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ (LSG) నిర్దేశించిన 147 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ కేవలం 15.1 ఓవర్లలోనే ఛేదించి, తమ అభిమానులకు కనువిందు చేసింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ నిర్ణయం సరైనదని బౌలర్లు నిరూపించారు. ఆర్సీబీ బౌలర్ రసీఖ్ దార్ (4/24) తన పదునైన బౌలింగ్‌తో లక్నో నడ్డి విరిచాడు. లక్నో జట్టులో మిచెల్ మార్ష్ (40), ముకుల్ చౌదరి (39) తప్ప మిగిలిన వారెవరూ రాణించలేకపోయారు. దీంతో లక్నో జట్టు 20 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
కోహ్లీ మెరుపులు.. ఈజీ టార్గెట్
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (49) అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. కేవలం ఒకే ఒక్క పరుగుతో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నప్పటికీ, జట్టును విజయతీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. రజత్ పాటిదార్ (27) అతనికి చక్కని సహకారం అందించాడు. చివరకు ఆర్సీబీ 15.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసి విజయాన్ని ఖాయం చేసుకుంది.






