విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం...ఏకంగా ఇంగ్లాండ్‌ మ్యూజియంలోనే!

by velandi.Saikiran |

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ( Virat Kohli) అరుదైన గౌరవం దక్కింది. టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య త్వరలోనే

విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం...ఏకంగా ఇంగ్లాండ్‌ మ్యూజియంలోనే!
X

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ( Virat Kohli) అరుదైన గౌరవం దక్కింది. టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య త్వరలోనే టెస్ట్ మ్యాచ్ లు జరగనున్న నేపథ్యంలో... విరాట్ కోహ్లీకి ఇంగ్లాండ్ ఎంత గౌరవం ఇస్తుందో తాజాగా వెలుగులోకి వచ్చింది. విరాట్ కోహ్లీ ఆటోగ్రాఫ్ చేసిన.. గ్లోవ్స్ ను మ్యూజియంలో పెట్టింది అక్కడి ప్రభుత్వం. ఇంగ్లాండ్ లో ఉన్న ఓవల్ మ్యూజియం చాలా పాపులర్ అన్న సంగతి తెలిసిందే.

ఆ మ్యూజియంలో ప్రముఖుల వస్తువులు, వాళ్లు ధరించిన దుస్తులు... రకరకాల పురాతన వస్తువులను ఉంచుతారు. అయితే ఇప్పుడు విరాట్ కోహ్లీ కి సంబంధించిన గ్లోవ్స్... ఆ మ్యూజియంలో పెట్టిన ఫోటో వైరల్ గా మారింది. దింతో ఈ ఫోటోను... విరాట్ కోహ్లీ అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కాగా ఇటీవల రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ కూడా టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇది ఇలా ఉండగా.. టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ జూన్ 13వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఐదు టెస్ట్ సిరీస్ భాగంగా... ఇంగ్లాండులో పర్యటించింది టీమిండియా. ఇక జూన్ 13వ తేదీ నుంచి ఈ రెండు జట్ల మధ్య మొదటి టెస్ట్ ప్రారంభమవుతుంది. చివరి టెస్టు జూలై 31వ తేదీ నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు కొనసాగనుంది.

Next Story