క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. టెస్టులకు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్

by Malleboina Mahesh |   (  Updated:2025-05-12 09:21:21  IST  )

భారత క్రికెట్ అభిమానులకు వరుస షాక్ లు తగులుతున్నాయి.

క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. టెస్టులకు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్
X

దిశ, వెబ్ డెస్క్: భారత క్రికెట్ అభిమానులకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. వారం రోజుల క్రితం రోహిత్ శర్మ (Rohit Sharma) టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన వార్తలను అభిమానులు మరిచిపోకముందే.. విరాట్ కోహ్లీ (Virat Kohli) కూడా రిటైర్మెంట్ (Retirement) ప్రకటించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. కొద్ది రోజుల క్రితమే కోహ్లీ తన రిటైర్మెంట్ (Retirement) గురించి బీసీసీఐకు చెప్పగా.. అతని నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బీసీసీఐ అధికారులు (BCCI officials) కోరుతూ వచ్చారు. కానీ చివరకు విరాట్ కోహ్లీ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. ఈ మేరకు కోహ్లీ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్‌లో కీలక పోస్ట్ చేశారు.

అందులో "టెస్ట్ క్రికెట్‌లో నేను మొదటిసారి బ్యాగీ బ్లూ ధరించి 14 సంవత్సరాలు అయ్యింది. నిజాయితీగా చెప్పాలంటే, ఈ ఫార్మాట్ నన్ను ఎలాంటి ప్రయాణంలో తీసుకెళుతుందో నేను ఎప్పుడూ ఊహించలేదు. ఇది నన్ను పరీక్షించింది. నన్ను తీర్చిదిద్దింది. జీవితాంతం నేను మోయాల్సిన పాఠాలను నేర్పింది. నేను ఈ ఫార్మాట్ నుండి వైదొలగుతున్నప్పుడు. ఇది సులభం కాదు - కానీ అది సరైనది గా అనిపిస్తుంది. నేను దానికి నా దగ్గర ఉన్నవన్నీ ఇచ్చాను. నేను ఆశించిన దానికంటే చాలా ఎక్కువ తిరిగి ఇచ్చింది. నేను కృతజ్ఞత తో నిండిన హృదయంతో వెళ్తున్నాను. నేను ఎల్లప్పుడూ నా టెస్ట్ కెరీర్‌ను చిరునవ్వుతో తిరిగి చూసుకుంటాను.

విరాట్ టెస్ట్ కెరీర్..

భారత క్రికెట్ జట్టులో రన్ మిషన్ గా పేరుగాంచిన విరాట్ కోహ్లీ.. 14 ఏళ్ల పాటు భారత్‌ తరఫున టెస్టులకు ప్రాతినిధ్యం వహించాడు. 2011లో వెస్టిండీస్‌పై టెస్టుల్లో ఆయన అరంగేట్రం చేశారు. కెరీర్‌లో 123 టెస్టు మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ.. 9,230 పరుగులు చేశారు. ఇందులో 30 శతకాలు, 31 అర్ధ శతకాలు ఉన్నాయి. 46.85 బ్యాటింగ్‌ సగటు ఉంది. 2025 జనవరి 3న ఆస్ట్రేలియాతో కోహ్లీ చివరి టెస్టు ఆడారు.

టెస్టులు - 123.

పరుగులు - 9,230.

సగటు - 46.85.

వందలు - 30.

అర్ధశతకాలు - 31.

కెప్టెన్‌గా టెస్టులు - 68.

కెప్టెన్‌గా విజయాలు - 40.

Next Story