టెస్ట్ క్రికెట్ నుంచి విరాట్ కోహ్లీ రిటైర్మెంట్?

by Mahesh |   ( Updated:2025-05-10 03:36:56.0  )
టెస్ట్ క్రికెట్ నుంచి విరాట్ కోహ్లీ రిటైర్మెంట్?
X

దిశ, వెబ్ డెస్క్: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) అన్ని ఫార్మాట్లలో జట్టుకు అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. జట్టు కెప్టెన్ ఎవరైనా సరే విరాట్ కోహ్లీ మాత్రం జట్టులో తప్పకుండా ఉంటాడు. యువ ప్లేయర్లకు ఎంతో ప్రేరణగా నిలిచే కోహ్లీని ఎప్పటికీ జట్టులో భాగస్వామ్యం చేసేందుకు కోచ్ లు ప్రయత్నిస్తుంటారు. భారత క్రికెట్ చరిత్రలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల త్రయం ఎంతో గుర్తింపు పొందింది. అయితే తాజాగా రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ (Retirement from Test cricket) ప్రకటించగా బీసీసీఐ ఆమోదం తెలిపింది. దీంతో అభిమానులు అంతా షాక్ కు గురయ్యారు.

ఈ క్రమంలో విరాట్ కోహ్లీ (Virat Kohli టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ నిర్ణయం గురించి భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI)కి తెలియజేసినట్లు వార్తలు వస్తున్నాయి. అతను రాబోయే ఇంగ్లాండ్ పర్యటనలో పాల్గొనే అవకాశం కనిపించడం లేదు. కోహ్లీ కొన్ని రోజుల క్రితమే తన నిర్ణయాన్ని బీసీసీఐ తెలియజేశాడు. భారత టెస్ట్ టీమ్ లో విరాట్ కోహ్లీ పాత్రను దృష్టిలో పెట్టుకుని.. కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ నిర్ణయంపై పునరాలోచించుకోవాలని BCCI ఉన్నతాధికారి కోరినట్లు తెలుస్తోంది. కాగా ఈ వార్తలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉండగా.. కోహ్లీ లేని టెస్టు జట్టును ఊహించుకోలేమని అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.



Next Story

Most Viewed