ఆస్తులు మొత్తం సోద‌రుడికి ఇచ్చేస్తున్న‌ విరాట్ కోహ్లీ.. !

by velandi.Saikiran |

రిటైర్మెంట్ దశకు వచ్చిన విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తన ఆస్తులను సోదరుడు వికాస్ పేరు

ఆస్తులు మొత్తం సోద‌రుడికి ఇచ్చేస్తున్న‌ విరాట్ కోహ్లీ.. !
X

దిశ‌, వెబ్ డెస్క్ : రిటైర్మెంట్ దశకు వచ్చిన విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తన ఆస్తులను సోదరుడు వికాస్ పేరు మీదకు బదిలీ చేసేందుకు కోహ్లీ నిర్ణయం తీసుకున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. గురు గ్రామంలో ఉన్న తన ఇంటికి సంబంధించిన జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ పవర్స్ మొత్తం వికాస్ కోహ్లీ పేరు మీద‌కు ట్రాన్స్‌ఫ‌ర్ చేశాడ‌ట కోహ్లీ. ఒక వ్యక్తికి సంబంధించిన ప్రాపర్టీకి ఆర్థిక, చట్టపరమైన అలాగే వ్యాపార సంబంధిత పనులు చూసుకోవడానికి మరొకరికి అధికారం కల్పించడమే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అంటారు.

అయితే ఆ హక్కును వికాస్ కు అప్పగించాడు కోహ్లీ. లండన్ నుంచి ఇటీవల ఇండియాకు వచ్చిన కోహ్లీ, మొద‌ట ఈ ప‌నిని ఫినీష్ చేసి, ఆసీస్ కు వెళ్లార‌ట‌. అయితే ఇప్పటికే అనుష్క శర్మ పేరుపైన గురుగ్రామ్ డిఎల్ఎఫ్ ఫేజ్ 1 ప్రాంతంలో విలాసవంతమైన ఓ బంగ్లా కూడా ఉంది. దీని విలువ దాదాపు రూ.80 కోట్లు ఉంటుందట. సుమారు 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ విల్లా నిర్మించాడట విరాట్ కోహ్లీ. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం ఆస్ట్రేలియన్ టూర్ లో విరాట్ కోహ్లీ ఉన్న సంగతి తెలిసిందే.

Next Story