బంగ్లా ఆల్‌రౌండర్ షకిబ్‌కు విరాట్ కోహ్లీ సర్‌ప్రైజ్

by saikumar |
బంగ్లా ఆల్‌రౌండర్ షకిబ్‌కు విరాట్ కోహ్లీ సర్‌ప్రైజ్
X

దిశ, స్పోర్ట్స్ : బంగ్లాదేశ్‌ ఆల్‌రౌండర్‌ షకిబ్‌ అల్ హసన్‌ భారత్‌తో తన చివరి టెస్టు మ్యాచ్‌ను ఆడేశాడు. కాన్పూర్‌ వేదికగా ఇండియా వర్సెస్ బంగ్లా మధ్య రెండో టెస్టు ముగిసింది. బహుశా షకిబ్‌కు టీమ్‌ఇండియాతో ఇదే చివరి మ్యాచ్‌ మ్యాచ్ అని తెలుస్తోంది. అంతేకాకుండా తన కెరీర్‌లో ఇదే చివరి టెస్టు మ్యాచ్‌ అని కూడా ఊహగానాలు వినిపిస్తున్నాయి. వచ్చే నెల స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్‌లో అతడు ఆడతాడా? లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ఈ క్రమంలోనే రెండో టెస్టు చివరి రోజున భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ షకిబ్‌కు ఓ బహుమతి ఇచ్చాడు.

ఇరుజట్ల ఆటగాళ్లు సంభాషించుకుంటున్న సమయంలో షకిబ్ దగ్గరకు వెళ్లిన కోహ్లీ.. తను సంతకం చేసిన ఓ బ్యాట్‌ను బహుమతిగా ఇచ్చాడు. ఆ తర్వాత ఇద్దరు కాసేపు సరదాగా ముచ్చటించుకున్నారు. కాగా, ఇటీవల టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికిన షకిబ్‌.. వచ్చే ఏడాది చాంపియన్స్‌ ట్రోఫీ ఆడాక వన్డే క్రికెట్‌కు సైతం గుడ్‌బై చెప్పనున్నట్లు సమాచారం. తన సొంత మైదానం మీర్పూర్‌లో చివరి టెస్టు ఆడాలనుకుంటున్నట్లు బోర్డుకు తెలపగా.. అందుకు బీసీబీ కూడా అంగీకరించిందని తెలిపాడు. ఇదిలాఉండగా, ఈ మధ్యకాలంలో బంగ్లాలో నెలకొన్న అశాంతి సమయంలో షకిబ్‌‌పై మర్డర్‌ కేసు నమోదు అయ్యింది. 38 ఏళ్ల షకిబ్‌.. బంగ్లా తరఫున 70 టెస్టుల్లో 4,600 పరుగులు చేసి 242 వికెట్లు పడగొట్టాడు. 247 వన్డేల్లో 7,570 పరుగులు, 317 వికెట్లు తీశాడు. ఇక 129 టీ20ల్లో 2,551 పరుగులు చేసి 149 వికెట్లు సాధించాడు.

Advertisement

Next Story