ICC Rankings : ఏకంగా 143 స్థానాలు ఎగబాకిన ఆ భారత క్రికెటర్

by Harish |

చాంపియన్స్ ట్రోఫీలో టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అదరగొడుతున్నాడు.

ICC Rankings : ఏకంగా 143 స్థానాలు ఎగబాకిన ఆ భారత క్రికెటర్
X

దిశ, స్పోర్ట్స్ : చాంపియన్స్ ట్రోఫీలో టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అదరగొడుతున్నాడు. పాక్‌పై అజేయ శతకం బాదిన అతను.. కీలకమైన సెమీస్‌లో ఆస్ట్రేలియాపై కూడా సత్తాచాటాడు. 98 బంతుల్లో 84 రన్స్ చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలోనే కోహ్లీ వన్డేల్లో తన ర్యాంక్‌ను మెరుగుపర్చుకున్నాడు. ఐసీసీ బుధవారం రిలీజ్ ర్యాంకింగ్స్‌లో బ్యాటింగ్ విభాగంలో విరాట్ ఒక్క స్థానాన్ని వెనక్కినెట్టి 4వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఇక, కెప్టెన్ రోహిత్ రెండు స్థానాలు కోల్పోయి 5వ ర్యాంక్‌కు పడిపోయాడు.

చాంపియన్స్ ట్రోఫీలో నిలకడగా రాణిస్తున్న శ్రేయస్ అయ్యర్ ఒక్క స్థానం ఎగబాకి 8వ ర్యాంక్‌లో నిలిచాడు. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు. టాప్-10లో భారత్ నుంచి ఐదుగురు బ్యాటర్లు ఉండటం విశేషం. ఆల్‌రౌండర్ పాండ్యా 9 స్థానాలు మెరుగుపర్చుకుని 90వ ర్యాంక్‌లో నిలిచాడు. ఇక, బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి భారీగా ర్యాంక్‌ను మెరుగుపర్చుకున్నాడు. ఏకంగా 143 స్థానాలు ఎగబాకి టాప్-100లో చోటు సంపాదించిన అతను 96వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో వరుణ్ గత రెండు మ్యాచ్‌ల్లో అదరగొట్టాడు. కివీస్‌పై ఐదు వికెట్లు పడగొట్టగా.. సెమీస్‌లో రెండు వికెట్లు తీశాడు. దీంతో అతని ర్యాంక్ భారీగా మెరుగుపడింది. ఆల్‌రౌండర్ విభాగంలో రవీంద్ర జడేజా టాప్ పొజిషన్‌లో కొనసాగుతున్నాడు.


Next Story