- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత మహిళల జట్టు విజయంపై విరాట్ కోహ్లీ ప్రశంసలు
ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచులో ఆస్ట్రేలియాపై అద్భుత విజయాన్ని సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టుకు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

దిశ వెబ్‌డెస్క్: ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ (Women's ODI World Cup) సెమీ ఫైనల్ మ్యాచులో ఆస్ట్రేలియాపై అద్భుత విజయాన్ని సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టు (Indian women's team)కు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్ అద్భుత బ్యాటింగ్, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఇన్నింగ్స్, రిచా, దీప్తీ శర్మల ఫైర్ బ్యాటింగ్ పై క్రికెట్ అభిమానులందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ (Virat Kohli) సోషల్ మీడియా వేదిక ‘X’ (ట్విట్టర్) ద్వారా టీమ్ ఇండియాపై ప్రశంసించారు. ఆయన తన ట్వీట్‌లో, “ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టుపై మన జట్టు సాధించిన అద్భుత విజయం. జెమిమా అద్భుత ప్రదర్శనతో గొప్ప ఛేజ్ పూర్తి చేశారు. ధైర్యం, నమ్మకం, ఆత్మవిశ్వాసానికి ఇది నిజమైన ప్రతిరూపం. టీమ్ ఇండియా అద్భుతం!” అని పేర్కొన్నారు. ఈ విజయంతో భారత మహిళా జట్టు ఫైనల్ చేరుకుంది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులతో పాటు ప్రముఖలు, మాజీ క్రికెటర్లు, రాజకీయ నాయకులు, వ్యాపరవెత్తలు.. భాతర మహిళల జట్టు ధైర్యాన్ని, పోరాటస్ఫూర్తిని ప్రశంసిస్తున్నారు.






