- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు కోహ్లీ నామినేట్
భారత దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లీ 2025కు సంబంధించి ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నామినేట్ అయ్యాడు.

దిశ, స్పోర్ట్స్ : భారత దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లీ 2025కు సంబంధించి ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. ఐసీసీ అవార్డుకు నామినేట్ అయిన ఆటగాళ్ల పేర్లను శనివారం ప్రకటించింది. కోహ్లీతోపాటు మాథ్యూ బ్రీట్జ్కే(సౌతాఫ్రికా),జోరూట్(ఇంగ్లాండ్), షాయ్ హోప్(వెస్టిండీస్), డారిల్ మిచెల్(న్యూజిలాండ్), మ్యాట్ హెన్రీ(న్యూజిలాండ్), ఆదిల్ రషీద్(ఇంగ్లాండ్), సికందర్ రజా(జింబాబ్వే), మిచెల్ సాంట్నర్(న్యూజిలాండ్), జైడెన్ సీల్స్(వెస్టిండీస్) కూడా నామినేట్ అయ్యారు. ఈ ఏడాది వన్డేల్లో కోహ్లీ సంచలన ప్రదర్శన చేశాడు. 13 వన్డేలు ఆడిన అతను 651 రన్స్ చేశాడు. అందులో మూడు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ ఏడాది భారత్ చాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో విరాట్‌ది ముఖ్య పాత్ర. 5 మ్యాచ్‌ల్లో 218 రన్స్ చేశాడు. కోహ్లీ ఇప్పటికే నాలుగు సార్లు వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలిచాడు. 2012, 2017, 2018, 2023లో అవార్డు గెలిచాడు. ఈ సారి గెలిస్తే 5వ సారి అవుతుంది. ఇప్పటికే విరాట్ అత్యధికసార్లు వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలిచిన ప్లేయర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే, ఈ సీజన్‌లో సంచలన ప్రదర్శన మరో భారత స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఈ అవార్డుకు నామినేట్ కాకపోవడం గమనార్హం. ఈ ఏడాది అతను 14 మ్యాచ్‌ల్లో 50 సగటుతో 650 రన్స్ చేశాడు.






