కోహ్లీ ఒకే ఒక్క పోస్ట్.. 3 గంటల్లోనే 50 లక్షల లైక్స్

by velandi.Saikiran |

కొత్త సంవత్సరం సందర్భంగా తన భార్య అనుష్కతో కలిసి ఓ ఫోటో దిగాడు విరాట్ కోహ్లీ. ఈ ఫోటోను తన ఇన్ స్టాలో పంచుకున్నాడు.

కోహ్లీ ఒకే ఒక్క పోస్ట్.. 3 గంటల్లోనే 50 లక్షల లైక్స్
X

దిశ‌, వెబ్ డెస్క్‌: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. టి20 లు, టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ కేవలం వ‌న్డేలు మాత్రమే ఆడుతున్నాడు. అదే సమయంలో ఐపీఎల్ లో ఆర్సీబీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కోహ్లీ. అలాంటి విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో కోహ్లీకి సంబంధించిన ఒక్క ఫోటో వైరల్ అయిన లక్షలాది మంది అభిమానులు చూసి తరిస్తారు.

అయితే ఈ కొత్త సంవత్సరం సందర్భంగా తన భార్య అనుష్కతో కలిసి ఓ ఫోటో దిగాడు విరాట్ కోహ్లీ. ఈ ఫోటోను తన ఇన్ స్టాలో పంచుకున్నాడు. దీంతో ఈ ఫోటో క్షణాల్లోనే వైరల్ గా మారింది. మూడు గంటల్లోనే 50 లక్షల లైక్స్ కూడా ఈ ఫోటో సంపాదించింది. ప్రస్తుతం 81 లక్షల లైక్స్ కూడా దాటాయి. డిసెంబర్ 31వ తేదీన పోస్ట్ చేసిన మరో ఫోటోను గంటలోపే 40 లక్షల మంది ఇష్టపడ్డారు. ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. కాగా భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఈనెల 11వ తేదీ నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. అందులో విరాట్ కోహ్లీ కూడా ఆడబోతున్నాడు.

Next Story