- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ ముగ్గురు బౌలర్లను ఆడటం, నా వల్ల కాదు..కోహ్లీ సంచలనం !
టెస్టుల్లో జేమ్స్ అండర్సన్ ను ఎదుర్కోవడం చాలా ఇబ్బందిగా ఉంటుందని విరాట్ కోహ్లీ పేర్కొన్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సచిన్ టెండూల్కర్ తరహాలోనే భారత జట్టును ఏలాడు. వేలాది పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు. అప్పట్లో క్రికెట్ దేవుడు సచిన్ అయితే... ఇప్పుడు విరాట్ కోహ్లీ అన్న రేంజ్ లో పరిస్థితి నెలకొంది. అలాంటి విరాట్ కోహ్లీని కూడా ముగ్గురు బౌలర్లు భయపెట్టించారట. వాళ్లను ఆడడం ఇప్పటికీ కూడా ఇబ్బందిగా ఉంటుందని స్వయంగా విరాట్ కోహ్లీ పేర్కొన్నట్లు ఓ పోస్టు వైరల్ గా మారింది. టెస్టుల్లో జేమ్స్ అండర్సన్ ను ఎదుర్కోవడం చాలా ఇబ్బందిగా ఉంటుందని విరాట్ కోహ్లీ పేర్కొన్నట్లు తెలుస్తోంది. 2014 ఇంగ్లాండ్ పర్యటనలో కూడా అతడి బౌలింగ్ లో విరాట్ కోహ్లీ చాలా ఇబ్బంది పడి ఔట్ అయ్యాడు.
ఇక వన్డే ఫార్మాట్ లో ఇంగ్లాండ్ బౌలర్ అదిల్ రషీద్ ను ఎదుర్కోవడం సవాల్ గా ఉంటుందని వివరించాడట. ఇప్పటి వరకు విరాట్ కోహ్లీని ఐదుసార్లు డిస్మిస్ చేసిన స్పిన్నర్ గా అదిల్ రషీద్ కు రికార్డు కూడా ఉంది. అటు మలింగా బౌలింగ్ ను తొలినాళ్లలో ఎదుర్కోవడం సవాల్ గా మారిందట. కానీ ఆ తర్వాత అలవాటైపోయిందని విరాట్ కోహ్లీ పేర్కొన్నట్లు తెలుస్తోంది. టీ20 క్రికెట్ లో సునీల్ నరైన్ ను ఎదుర్కోవడం చాలా ఇబ్బందిగా ఉంటుందని విరాట్ కోహ్లీ ఒప్పుకున్నాడట. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. కాగా విరాట్ కోహ్లీ కేవలం వన్డేల్లో మాత్రమే ఆడుతున్నాడు. టెస్టులతో పాటు టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అటు ఐపీఎల్ లో బెంగుళూరు తరఫున బరిలోకి దిగుతున్నాడు.






