- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫైనల్ మ్యాచ్ లో శిఖర్ ధావన్ రికార్డు బ్రేక్ చేసిన కోహ్లీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ లో

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ హిస్టరీలో అత్యధిక బౌండరీలు కొట్టిన ఆటగాడిగా బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు సృష్టించాడు.
టోర్నమెంట్ లో అతను ఇప్పటివరకు 770 బౌండరీలు సాధించాడు. ఈ నేపథ్యంలోనే.. కొత్త చరిత్ర సృష్టించాడు కోహ్లీ. ఇప్పటివరకు ఈ రికార్డు పంజాబ్ కింగ్స్ మాజీ కెప్టెన్ శిఖర్ ధావన్ పేరుతో ఉండేది. అతను 768 బౌండరీలు సాధించాడు.
ఇప్పుడు ఆ రికార్డును విరాట్ కోహ్లీ బ్రేక్ చేశాడు. విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ తర్వాత... వార్నర్ 663, రోహిత్ శర్మ 640 ఫౌండరీలతో తర్వాతి స్థానాలలో ఉన్నారు. అజింక్య రహానే 514 బౌండరీలు సాధించాడు. ఇది ఇలా ఉండగా... ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు... భారీ స్కోర్ దిశగా వెళ్తోంది.






