నటి అవనీత్ కౌర్‌కు ఫిదా! విరాట్ కోహ్లీ ఇన్‌స్టా లైక్‌పై నెట్టింట చర్చ.. వివరణ ఇచ్చిన కింగ్

by Ramesh Naini |

భారత స్టార్ క్రికెటర్ కింగ్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఇటీవల సోషల్ మీడియాలో చేసిన ఓ పనికి నెట్టింట చర్చానీయాంశంగా మారింది.

నటి అవనీత్ కౌర్‌కు ఫిదా! విరాట్ కోహ్లీ ఇన్‌స్టా లైక్‌పై నెట్టింట చర్చ.. వివరణ ఇచ్చిన కింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత స్టార్ క్రికెటర్ కింగ్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఇటీవల సోషల్ మీడియాలో చేసిన ఓ పనికి నెట్టింట చర్చానీయాంశంగా మారింది. ప్రముఖ నటి అవనీత్ కౌర్ ఇన్‌స్టాగ్రాంలో (Instagram post) పెట్టిన ఒక పోస్ట్‌ను విరాట్ లైక్ చేయడం, తర్వాత లైక్‌ను తొలగించడంతో అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీంతో సామాజిక మాధ్యమాల్లో విరాట్ కోహ్లీ, నటి మధ్య గాసిప్స్ ఏదో ఉందని గాసిప్స్ మొదలైయ్యాయి. ఇక దానికి చెక్ పెట్టేలా విరాట్ కోహ్లీ స్వయంగా స్పందించి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

ఏప్రిల్ 30న నటి అవనీత్ కౌర్ (Avneet Kaur) గోవా లోకేషన్‌లో దిగిన కొన్ని ఫోటోలను తన ఖాతా ద్వారా పోస్ట్ చేశారు. ఈ పోస్టును క్రికెటర్ విరాట్ కోహ్లీ మొదటగా లైక్ చేసినట్లు కొందరు నెటిజన్లు గమనించి స్క్రీన్‌షాట్లు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్స్ క్లోహ్లీ అభిమానులు, నెటిజన్లు నెట్టింట షేర్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే విరాట్ లైక్ తొలగించినట్లుగా తెలుస్తోంది. దీంతో సోషల్ మీడియాలో తెగ చర్చ జరుతోంది. వీరి పేరుతో గాసిప్స్, ఫన్నీ వీడియోలు, మీమ్స్ నెటిజన్లు క్రియేట్ చేశారు. గతంలో తను విరాట్ గర్ల్ ఫ్రెండ్ అని, మళ్లీ తనపై విరాట్ మనసు పడ్డట్టు నెటిజన్లు భావిస్తున్నారు. నటి అవనీత్ కౌర్‌కు విరాట్ ఫిదా అయినట్లు కొందరు నెటిజన్లు కామెంట్స్ పెట్టారు. అదేవిధంగా తన భార్య, బాలివుడ్ నటి అయిన (Anushka Sharma) అనుష్క శర్మను మోసం చేస్తున్నారు? అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

తనపై రూమర్స్ రావడంతో విరాట్ కోహ్లీ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వేదికగా తాజాగా కోహ్లీ ఒక ప్రకటన విడుదల చేశారు. తన ఫీడ్‌ను క్లియర్ చేస్తున్న సమయంలో (లైక్) అది పొరపాటున జరిగినట్లుందని తెలిపారు. అల్గారిథమ్ వల్ల ఈ ఇంటరాక్షన్ జరిగి ఉండొచ్చు.. దీని వెనుక తన వైపు నుంచి ఎలాంటి ఉద్దేశం లేదని తెలిపారు. దయచేసి దీనిపై అనవసరమైన ఊహాగానాలు చేయవద్దని కోహ్లీ అభ్యర్థించారు.

Next Story