- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Virat Kohli: వన్డేల్లో రాణించాలంటే చాలా లెక్కలేసుకొని ఆడాలి: కోహ్లీ
వన్డే ఫార్మాట్లో రాణించడం గురించి విరాట్ కోహ్లీ వివరించాడు. ఈ ఫార్మాట్లో చాలా లెక్కలేసుకొని ఆడాల్సి ఉంటుందని కుర్రాళ్లకు సలహా ఇచ్చాడు.

దిశ, స్పోర్ట్స్: వన్డే క్రికెట్‌లో సక్సెస్ కావాలంటే ఏం చేయాలో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ స్పందించాడు. ‘వన్డే క్రికెట్’ ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలని, ఈ ఫార్మాట్లో ఆటలోని అన్ని అంశాలను ఉపయోగించుకుంటేనే విజయం సాధిస్తామని చెప్పాడు. ఇటీవలి కాలంలో టీ20, టెస్టు ఫార్మాట్లకు ప్రజాదరణ దక్కుతున్నప్పటికీ, వన్డేలకు ఆదరణ తగ్గింది. అయితే ఈ ఏడాది జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీతో మరోసారి వన్డేలపై ప్రజల ఆసక్తి పెరిగిందనే చెప్పాలి. ఈ క్రమంలోనే వన్డేల ప్రత్యేకతను కోహ్లీ వివరించాడు.
‘ఛాంపియన్స్ ట్రోఫీతో చాలామందికి వన్డే క్రికెట్ అందమేంటో అర్థమైంది. ఈ ఫార్మాట్లో విజయవంతం కావాలంటే ఆటలోని అన్ని అంశాలపై పట్టుండాలి. ఒక్కోసారి ఓపిన పట్టాలి. మరోసారి విధ్వంసకరంగా ఆడాలి. అదే సమయంలో స్టామినా చాలా ముఖ్యం. ఫీల్డింగ్‌లో కూడా ఇంటెన్సిటీ చూపించాలి’ అని కోహ్లీ చెప్పాడు.
టీ20లకు అలవాటైన కుర్రాళ్లు.. వన్డేల్లో ధనాధన్ షాట్లు ఆడలేని సమయంలో స్ట్రైక్ రొటేట్ చేయడం, రన్ రేట్ చేయి దాటకుండా చూసుకోవడంలో ఇబ్బంది పడతారన్నాడు. వన్డేల్లో పరిస్థితులకు తగ్గట్లు, చాలా లెక్కలేసుకుంటూ ఆడాల్సి ఉంటుందని తెలిపాడు.






