- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బెంగళూరు తొక్కిసలాటపై ఎమోషనల్ అయిన కోహ్లీ.. సోషల్ మీడియాలో పోస్టు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఐపీఎల్ విజయోత్సవాలు విషాదంగా మారిన విషయం తెలిసిందే.

దిశ, స్పోర్ట్స్ : రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఐపీఎల్ విజయోత్సవాలు విషాదంగా మారిన విషయం తెలిసిందే. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జూన్ 4న చోటుచేసుకున్న తొక్కిసలాటలో 11 మంది మరణించారు. ఈ ఘటనపై ఆర్సీబీ స్టార్ ప్లేయర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. ఆర్సీబీ ఎక్స్ ఖాతా నుంచి ఎమోషనల్ పోస్టు పెట్టాడు. తమ ఫ్రాంచైజీకి అత్యంత సంతోషకరమైన క్షణాలు విషాదంగా మారాయని ఆవేదన చెందాడు. ‘జూన్ 4న జరిగిన హృదయ విదారక ఘటన జీవితంలో జరుగుతుందని అనుకోలేం. మా ఫ్రాంచైజీ చరిత్రలోనే అత్యంత సంతోషకరమైన క్షణాలు అవి. విషాదంగా మారాయి. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల కోసం, గాయపడిన మా అభిమానుల కోసమే నేను ఆలోచిస్తున్నా. ప్రార్థిస్తున్నా. మీకు జరిగిన నష్టం మాలో భాగం. ఇకపై మరింత జాగ్రత్తగా, గౌరవంగా, బాధ్యతతో కలిసికట్టుగా ముందుకు సాగుతాం.’అని కోహ్లీ తెలిపాడు. కాగా, ఇటీవల ఆర్సీబీ ఫ్రాంచైజీ ఆర్సీబీ కేర్ ద్వారా మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున అందజేయనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.
“Nothing in life really prepares you for a heartbreak like June 4th. What should’ve been the happiest moment in our franchise’s history… turned into something tragic. I’ve been thinking of and praying for the families of those we lost… and for our fans who were injured. Your… pic.twitter.com/nsJrKDdKWB
— Royal Challengers Bengaluru (@RCBTweets) September 3, 2025






