- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Virat Kohli : రోహిత్ శర్మకు షాక్..ఫస్ట్ ప్లేస్ కు విరాట్ కోహ్లీ !
రోహిత్ శర్మ ర్యాంకింగ్స్ లో మొదటి స్థానంలో ఉండగా విరాట్ కోహ్లీ రెండవ స్థానంలో ఉన్నాడు.

దిశ, వెబ్ డెస్క్: ఐసీసీ ర్యాంకింగ్స్ లో రోహిత్ శర్మకు ( Rohit Sharma) ఊహించని ఎదురుదెబ్బ తగిలే ప్రమాదం పొంచి ఉంది. న్యూజిలాండ్ వర్సెస్ భారత్ మధ్య జరిగిన మొదటి వన్డేలో విరాట్ కోహ్లీ ( Virat Kohli ) సెంచరీ చేయడంతో, రోహిత్ శర్మ ర్యాంకు పడిపోయే ఛాన్సులు ఉన్నాయి. అంటే ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో ( ICC ODI Ranking) రోహిత్ శర్మను దాటుకొని విరాట్ కోహ్లీ మొదటి స్థానానికి వెళ్తాడని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.
ప్రస్తుతం రోహిత్ శర్మ ర్యాంకింగ్స్ లో మొదటి స్థానంలో ఉండగా విరాట్ కోహ్లీ రెండవ స్థానంలో ఉన్నాడు. 781 పాయింట్లతో రోహిత్ శర్మ మొదటి స్థానంలో ఉండగా, విరాట్ కోహ్లీ ఖాతాలో 773 పాయింట్లు ఉన్నాయి. నిన్న న్యూజిలాండ్ పైన రోహిత్ శర్మ పెద్దగా రాణించలేదు. కానీ విరాట్ కోహ్లీ మాత్రం 93 పరుగులు సాధించాడు. బుధవారం రోజున ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ ప్రకటిస్తారు. అయితే ఆ ర్యాంకింగ్స్ ప్రకారం రోహిత్ శర్మ రెండవ స్థానానికి చేరుతాడని, విరాట్ కోహ్లీ మొదటి స్థానానికి వెళ్తాడని తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.






