విరాట్ కోహ్లీ కీల‌క ప్ర‌క‌ట‌న‌..ఇకపై ఆ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా !

by velandi.Saikiran |

అజిలిటాస్‌ ( Agilitas) బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ కూడా పెట్టాడు

విరాట్ కోహ్లీ కీల‌క ప్ర‌క‌ట‌న‌..ఇకపై ఆ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా !
X

దిశ‌, వెబ్‌డెస్క్‌: దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ లో అదరగొట్టిన విరాట్ కోహ్లీ కీలక ప్రకటన చేశాడు. మొన్నటి వరకు పూమా (Puma) ప్రమోట్ చేసిన విరాట్ కోహ్లీ, ఇప్పుడు అజిలిటాస్‌ ( Agilitas) బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ కూడా పెట్టాడు. 2017 సంవత్సరంలో పూమాతో అగ్రిమెంట్ చేసుకున్నాడు విరాట్ కోహ్లీ. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ బ్రాండ్ ప్రమోట్ చేశాడు. ఇకపై అజిలిటాస్‌ బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగనున్నాడు కోహ్లీ.

ఈ అజిలిటాస్‌ ను అభిషేక్ గంగూలీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అతను గతంలో పూమా ఇండియా, సౌత్ ఈస్ట్ ఆసియాకు మేనేజింగ్ డైరెక్టర్ గా కూడా పనిచేసిన అనుభవం ఉంది. ఇక అజిలిటాస్‌ కోసం ప్యూమా ఆఫర్ చేసిన 300 కోట్ల ఒప్పందాన్ని కూడా విరాట్ కోహ్లీ వదులుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక గతంలో అజిలిటాస్‌ లో దాదాపు 40 కోట్ల పెట్టుబడులు కూడా విరాట్ కోహ్లీ పెట్టాడట. లేటెస్ట్ గా జరిగిన ఒప్పందం ప్రకారం తన సొంత బ్రాండ్ వన్ 8 ప్రొడక్ట్స్ కూడా అజిలిటాస్‌ ద్వారా కస్టమర్లకు అందుబాటులో రానున్నాయి. కాగా మొన్నటి వరకు దక్షిణాఫ్రికాపై జరిగిన వన్డే సిరీస్ లో విరాట్ కోహ్లీ దుమ్ము లేపాడు. రెండు సెంచరీలతో పాటు ఒక అర్థ సెంచరీ నమోదు చేసి చరిత్ర సృష్టించాడు కోహ్లీ.

Next Story