- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- వైరల్
- పర్యాటకం
- టెక్నాలజీ
- Telugu News
- IPL2023
కింగ్ కోహ్లీ నయా రికార్డు.. ఆసియాలోనే నెంబర్ వన్ ప్లేయర్!

దిశ, వెబ్‌డెస్క్: పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ ఆటలోనే కాదు సోషల్ మీడియాలో కూడా తాను కింగ్‌నే అని మరోసారి నిరూపించుకున్నాడు. ఇటీవలే ఐపీఎల్ రెండు వరుస శతకాలతో అభిమానులను అలరించిన కోహ్లి తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో 250 మిలియన్ ఫాలోవర్లను సంపాదించాడు. ఆసియా ఖండం నుంచి ఈ ఘనత సాధించిన ఒకే ఒక్కడిగా కోహ్లి నిలిచాడు. టీమ్ ఇండియా తరఫున ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన క్రికెటర్‌గానూ కోహ్లి రికార్డులకెక్కాడు. కోహ్లి దరిదాపుల్లో కూడా ఎవరు లేరు. కోహ్లి తర్వాత ఎంఎస్ ధోని 42.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇక టీమిండియా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌కు ఇన్‌స్టాలో 40.3 మిలిమిన్ ఫాలోవర్స్ ఉన్నారు.
ఇక పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్లో ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన క్రీడాకారుడిగా నిలిచాడు. రొనాల్డోను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యేవారి సంఖ్య 585 మిలియన్. రొనాల్డో తర్వాత లియోనల్‌మెస్సీ 462 మంది మిలియన్ ఫాలోవర్స్‌తో రెండో స్థానంలో ఉన్నాడు.