టీ 20 వరల్డ్ కప్ లో కోహ్లీకి ఛాన్స్.. రోహిత్‍తో ఓపెనింగ్..!

by Dishanational6 |
టీ 20 వరల్డ్ కప్ లో కోహ్లీకి ఛాన్స్.. రోహిత్‍తో ఓపెనింగ్..!
X

దిశ, స్పోర్ట్స్: టీ 20 వరల్డ్ కప్ ప్రారంభం కావడానికి ఇంకా కొన్ని వారాలే సమయముంది. అయితే.. ఇంకా భారత జట్టుకూర్పుపై స్పష్టత రాలేదు. జట్టులో ఎవరుంటారో.. ఎవరుండరో.. తెలియట్లేదు. అయితే, ఐపీఎల్ కు మందు ప్రపంచకప్ లో కోహ్లీకి చోటు దక్కుతుందో లేదో అనే అనుమానం ఉండేది. ఐపీఎల్ లో దూకుడు ప్రదర్శిస్తున్న ఈ రన్ మెషీన్.. వరల్డ్ కప్ లో తన రోల్ గురించి బీసీసీఐని అడిగినట్లు సమాచారం. ముంబైలో హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ భేటీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ భేటీలోనే ప్రపంచకప్ లో కోహ్లీ, పాండ్యాలపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, భీకర ఫామ్‍లో ఉన్న కోహ్లీని ప్రపంచకప్‍కు తీసుకోవాలని సెలెక్టర్లు ఫిక్స్ అయినట్టు సమాచారం బయటికి వచ్చింది. దీంతో, ఈ ఏడాది జూన్‍లో జరిగే టీ20 ప్రపంచకప్‍లో కోహ్లీకి చోటు దక్కడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ మెగాటోర్నీలో రోహిత్ శర్మతో కలిసి కోహ్లీ ఓపెనింగ్ చేయనున్నాడని అంచనాలు ఉన్నాయి.

ఈ ఏడాది ఇంగ్లండ్‍తో టెస్టు సిరీస్‍లో భారత యంగ్ స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ విజృంభించాడు. డబుల్ సెంచరీలతో రెచ్చిపోయాడు. అయితే, ప్రస్తుత ఐపీఎల్ సీజన్‍లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఇప్పటి వరకు 7 మ్యాచ్‍ల్లో కేవలం 121 పరుగులే చేశాడు జైస్వాల్. ఫాం కోల్పోయాడు. త్వరగా పెవిలియన్ చేరుతూ నిరాశపరుస్తన్నాడు. దీంతో టీ20 ప్రపంచకప్‍కు జైస్వాల్‍ను పక్కన పెట్టాలని సెలెక్టర్లు ప్రస్తుతం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక, శుభ్‍మన్ గిల్‍ను బ్యాకప్ ఓపెనర్‌గా ప్రపంచకప్‍కు తీసుకోవాలని సెలెక్టర్లు భావిస్తున్నారని తెలుస్తోంది.

మిడిల్ ఆర్డర్‌లో, రింకు సింగ్, శివమ్ దూబే లాంటి ఆల్ రౌండర్లను పరిశీలిస్తుంది బీసీసీఐ. రియాన్ పరాగ్ ను కూడా టీంలోకి తీసుకోవాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం.

కోహ్లీని ఓపెనర్‌గా తీసుకుంటే.. భారత జట్టులో యశస్వి జైస్వాల్ కు చోటు ఉండదు. దీంతో, టీ20 వరల్డ్ కప్ తుది జట్టు ఇంకా ప్రకటించాల్సి ఉండగా.. జైస్వాల్ తన ఫాంను మెరుగుపరుచుకోవాలని బీసీసీఐ సూచించినట్లు సమాచారం.

Next Story

Most Viewed