కోహ్లీ పేరును ఫోన్‌లో ఏమని సేవ్ చేసుకుందో బయటపెట్టిన అనుష్క!

by Disha Web Desk 19 |
కోహ్లీ పేరును ఫోన్‌లో ఏమని సేవ్ చేసుకుందో బయటపెట్టిన అనుష్క!
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023 నుండి లీగ్ దశలోనే ఆర్సీబీ ఇంటి ముఖం పట్టడంతో ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కాస్త రిలాక్స్ అవుతున్నాడు. జూన్ 7వ తేదీ నుండి ఇంగ్లాండ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌కు సిద్ధమవుతోన్న విరాట్.. తాజాగా భార్య అనుష్క శర్మతో కలిసి ‘‘జామ్ విత్ ఫామ్’’ అనే షోలో పాల్గొన్నారు. ఈ షోలో ఎంతో ఉత్సహంగా కనిపించిన విరాట్, అనుష్కల జోడి అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చారు. యాంకర్ అడిగిన ప్రశ్నలకు అదిరిపోయే రీతిలో సమాధానాలు ఇస్తూ సందడి చేశారు.

ఇక, గ్రౌండ్‌లో విరాట్ కోహ్లీ చూపించే అగ్రేషన్, ఎమోషన్స్‌ను ఈ షోలో అనుష్క శర్మ ఇమిటేట్ చేసి అభిమానులను అలరించింది. అంతేకాకుండా మీ భర్త కోహ్లీ నెంబర్ మీ ఫోన్‌లో ఏ నేమ్‌తో సేవ్ చేసుకున్నారని యాంకర్ ప్రశ్నించగా.. ‘‘పతి పరమేశ్వర్’’ అనే నేమ్‌తో తన భర్త పేరును సేవ్ చేసుకున్నానని అనుష్క చెప్పింది. కెరీర్‌లో బెస్ట్ ఇన్సింగ్ ఏదని విరాట్ కోహ్లీని యాంకర్ ప్రశ్నించగా.. తాను ఆడిన లాస్ట్ ఇన్సింగే తన బెస్ట్ ఇన్నింగ్స్ అని కోహ్లీ రిప్లై ఇచ్చాడు. ఇక, అనుష్క, విరాట్‌ల షోకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన కోహ్లీ అభిమానులు బ్యూటీపుల్ జోడి అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Next Story