షాకింగ్.. పెళ్లి చేసుకున్న విజయ్-రష్మిక...ఇదిగో ఫోటోలు !

by velandi.Saikiran |   (  Updated:2026-01-27 16:01:32  IST  )

గత ఏడాది ఎంగేజ్మెంట్ చేసుకున్న విజయ్, రష్మిక జంట‌, జ‌న‌వ‌రి 26వ తేదీన‌ పెళ్లి చేసుకున్నట్లు ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

షాకింగ్.. పెళ్లి చేసుకున్న విజయ్-రష్మిక...ఇదిగో ఫోటోలు !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ అగ్ర హీరో విజయ్ దేవరకొండ, రష్మిక జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవలే ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట, త్వరలో పెళ్లి చేసుకోబోతుందట. 2025 అక్టోబర్ 3వ తేదీన చాలా గోప్యంగా విజయ్ దేవరకొండ, రష్మిక ఎంగేజ్మెంట్ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటివరకు దీనిపై ఈ జంట అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. ఇలాంటి నేపథ్యంలో విజయ్, రష్మిక పెళ్లి చేసుకున్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి.

విజయ్, రష్మిక పెళ్లి చేసుకున్నారా ?

గత ఏడాది ఎంగేజ్మెంట్ చేసుకున్న విజయ్, రష్మిక జంట‌, జ‌న‌వ‌రి 26వ తేదీన‌ పెళ్లి చేసుకున్నట్లు ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇక వీళ్ళ పెళ్లికి ప్రిన్స్ మహేష్ బాబు, అల్లు అర్జున్, టాలీవుడ్ ప్రముఖులందరూ కుటుంబ సమేతంగా వచ్చినట్లు ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన తెలుగు ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. ఏంటి ఇంత సడన్ గా పెట్టుకుంటున్నారా? ఇది నిజమేనా ? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. వాస్తవంగా విజయ్, రష్మిక ఇంకా పెళ్లి చేసుకోలేదు. కొంతమంది ఏఐ ద్వారా వీళ్ళ పెళ్లి జరిగినట్లు ఫోటోలు క్రియేట్ చేశారు. ఆ ఫోటోలే ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. కాగా ఫిబ్రవరి 26వ తేదీన రాజస్థాన్ లోని ఉదయపూర్ లో ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి.

Next Story