- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
కరుణ్ నాయర్ విధ్వంసం.. విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్‌కు విదర్భ

దిశ, స్పోర్ట్స్ : కరుణ్ నాయర్ మరోసారి విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 44 బంతుల్లో ఐదు సిక్సులు, తొమ్మిది ఫోర్లతో 88 పరుగులు చేసి రెచ్చిపోయాడు. దీంతో గురువారం జరిగిన విజయ్ హజారే ట్రోఫీ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో విదర్భ జట్టు మహారాష్ట్రపై 69 పరుగుల తేడాతో విజయం సాధించింది. వడోడరలోని కొతంబి స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్‌లో విదర్భ తొలుత బ్యాటింగ్ చేసింది. 50 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 380 పరుగులు చేసింది. విదర్భ ఓపెనర్లు ధ్రువ్ షోరే(114), యష్ రాథోడ్(116) పరుగులు చేశారు. తొలి వికెట్‌కు ఈ ఇద్దరు 224 పరుగులు జోడించారు. తొలి వికెట్ పడిన తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కరుణ్ నాయర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. దీంతో విదర్భ భారీ స్కోరు నమోదు చేసింది. మహారాష్ట్ర బౌలర్లలో ముఖేష్ చౌదరి 2 వికెట్లు తీశాడు. బౌలర్లు తేలిపోయి భారీగా పరుగులు సమర్పించుకున్నారు.
మహారాష్ట్ర పోరాడినా..
భారీ పరుగుల లక్ష్య ఛేదనలో మహారాష్ట్ర జట్టుకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రుతురాజ్ గైక్వాడ్ కేవలం 7 పరుగులకే ఔట్ అయ్యాడు. అనంతరం అర్షిన్ కులకర్ణి(90) స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అంకిత్ బావ్నే(50), నిఖిల్ నాయక్(49) పరుగులు చేసినా జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయారు. దీంతో మహారాష్ట్ర నిర్ణీత 50 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 311 పరుగులు మాత్రమే చేసింది. విదర్భ బౌలర్లలో దర్శన్ 3, నచికేత్ భుతే 3 వికెట్లు పడగొట్టారు.