- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విజయ్ హజారే ట్రోఫీలో సెమీస్‌కు చేరుకున్న విదర్భ, హర్యానా
విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ, హర్యానా జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి.

దిశ, స్పోర్ట్స్ : విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ, హర్యానా జట్లు సెమీస్‌కు దూసుకెళ్లాయి. ఆదివారం వడోదరాలో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో రాజస్థాన్‌ను విదర్భ ఓడించగా.. గుజరాత్‌పై హర్యానా విజయం సాధించింది. హర్యానా బౌలర్ల ధాటికి ముందుగా గుజరాత్ 45.2 ఓవర్లలో 196 స్కోరుకే ఆలౌటైంది. హెమాంగ్ పటేల్(54) టాప్ స్కోరర్. అనంతరం హర్యానా కూడా ఛేదనలో కష్టపడింది. హిమాన్షు రాణా(66) మెరవడంతో 44.2 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దినేశ్(12 నాటౌట్), అన్షుల్ కాంబోజ్(7 నాటౌట్) వికెట్ కాపాడుకుని జట్టును విజయతీరాలకు చేర్చారు. ఇక, మరో క్వార్టర్స్‌లో కరుణ్ నాయర్(122 నాటౌట్), ధ్రువ్ షోరే(118 నాటౌట్) అజేయ శతకాలతో రెచ్చిపోయి విదర్భను సెమీస్‌కు చేర్చారు. ముందుగా రాజస్థాన్ 291/8 స్కోరు చేసింది. ఆ జట్టు ఇన్నింగ్స్‌లో కార్తీక్ శర్మ(62) శుభమ్ గర్వాల్(59), దీపక్ హుడా(45), దీపక్ చాహర్(31) రాణించారు. ఆ తర్వాత 292 పరుగుల లక్ష్యాన్ని విదర్భ 43.3 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి చేధించింది. కెప్టెన్ కరుణ్ నాయర్, ధ్రువ్ అజేయ సెంచరీలతో కదం తొక్కారు. రెండో వికెట్‌కు ఈ జోడీ 200 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పడంతో విదర్భ విజయం తేలికైంది. మహారాష్ట్ర, కర్ణాటక ఇప్పటికే సెమీస్‌లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. బుధవారం తొలి సెమీస్‌లో కర్ణాటకతో హర్యానా, గురువారం రెండో సెమీస్‌లో మహారాష్ట్రతో విదర్భ తలపడనున్నాయి.






