ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో చరిత్ర సృష్టించి వరుణ్ చక్రవర్తి

by Malleboina Mahesh |

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు న్యూజిలాండ్ పై 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచులో భారత మిస్టీరియస్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి చరిత్ర సృష్టించాడు.

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో చరిత్ర సృష్టించి వరుణ్ చక్రవర్తి
X

దిశ, వెబ్ డెస్క్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy) 2025 లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత (Inida) జట్టు న్యూజిలాండ్ (New Zealand) పై 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచులో భారత మిస్టీరియస్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (Spinner Varun Chakraborty) చరిత్ర సృష్టించాడు. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచులో టాస్ ఓడిన భారత్ మొదట బ్యాటింగ్ చేసింది. అయితే వెంట వెంటనే కీలక వికెట్లను కోల్పోవడంతో పరుగుల కోసం భారత బ్యాటర్లు (Indian batters) చెమటోడ్చాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో అయ్యర్ 79, అక్షర్ పటేల్ 42, రాహుల్ 23, పాండ్య 45, పరుగులు చేయడంతో నిర్ణీత 50 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయిన భారత్ 249 పరుగులు మాత్రమే చేసింది.

అనంతరం 250 పరుగుల లక్ష్యంతో చేజింగ్ దిగిన న్యూజిలాండ్ స్వల్ప టార్గెట్ ను ఈజీగా చేజ్ చేయాలని భావించింది. ఈ క్రమంలో కొత్తగా జట్టులోకి వచ్చిన వరుణ్ చక్రవర్తి.. తన మిస్టీరియస్ బౌలింగ్ తో న్యూజిలాండ్ ప్లేయర్‌లకు చుక్కలు చూపించాడు. ఓ వైపు విలియమ్సన్ దీటుగా అవుతున్నప్పటికి.. ఇతర బ్యాటర్లను వరుణ్ చక్రవర్తి ఇబ్బంది పెట్టాడు. ఈ మ్యాచులో మొత్తం 10 ఓవర్లు వేసిన వరుణ్.. 42 పరుగులు ఇచ్చి.. 5 వికెట్లను పడగొట్టాడు. ఇందులో ఓపెనర్ విల్ యంగ్ తో పాటు, గ్లేన్ ఫిలిప్స్, బ్రెస్ వెల్, శాంట్నర్ వంటి కీలక ప్లేయర్లు ఉన్నారు. ఈ ఐదు వికెట్లతో వరుణ్ చక్రవర్తి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు (Man of the Match Award)ను సైతం గెలుచుకున్నాడు.

అలాగే ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) మొదటి మ్యాచ్ లో ఏకంగా 5 వికెట్లు తీసుకున్న వరుణ్ చక్రవర్తి (Varun Chakraborty) చరిత్ర సృష్టించాడు. కెరీర్ ప్రారంభ రెండో వన్డేలోనే ఈ ఘనత సాధించిన భారత బౌలర్ గా నిలిచాడు. 2014లో స్టువర్ట్ బిన్నీ తన మూడో వన్డే మ్యాచులో బంగ్లాపై ఏకంగా ఆరు వికెట్లు తీసుకున్న మొదటి బౌలర్ గా నిలవగా ఇప్పుడు రెండో వన్డేలో 5 వికెట్లు తీసిన బౌలర్ గా వరుణ్ చక్రవర్తి నిలిచాడు. ఇదిలా ఉంటే.. నిన్నటి మ్యాచుల్లో 10 వికెట్లకు గాను మొత్తం 9 వికెట్లను స్పిన్నర్లు తీశారు. అలాగే ఈ మ్యాచులో హర్దిక్ 4, షమీ నాలుగు ఓవర్లు మినహా.. మిగిలిన ఓవర్లు మొత్తం స్పిన్నర్లు వేయడంతో భారత్ విజయం సాధించినట్లు క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Next Story