- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Varun Chakaravarthy: పాకిస్తాన్ కు వార్నింగ్ ఇచ్చిన వరుణ్..అభిషేక్ వస్తున్నాడంటూ
పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ కు అభిషేక్ శర్మ రెడీగా ఉంటాడని వరుణ్ చక్రవర్తి చెప్పే ప్రయత్నం చేశాడు.

దిశ, వెబ్ డెస్క్: భారత డేంజర్ ఓపెనర్ అభిషేక్ శర్మ ( Abhishek Sharma) హెల్త్ అప్డేట్ ఇచ్చాడు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి. అభిషేక్ శర్మ ఇప్పుడిప్పుడే కోరుకుంటున్నాడని వివరించారు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ( Varun Chakaravarthy ). ఇండియాతో పాకిస్తాన్ మ్యాచ్ జరిగే సమయానికి కోలుకుంటాడని కూడా పేర్కొన్నారు. పాకిస్తాన్ పై జరిగే మ్యాచ్ సందర్భంగా అభిషేక్ శర్మ అందుబాటులో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. కానీ ఈ విషయంపై కచ్చితంగా క్లారిటీ ఇవ్వలేను అన్నారు. కానీ నేను అభిషేక్ శర్మతో మాట్లాడుతున్నాను, అతడు చాలా యాక్టివ్ గా ఉన్నారని వివరించారు వరుణ్ చక్రవర్తి.
పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ కు అభిషేక్ శర్మ రెడీ
దాదాపు కోలుకున్నట్లే కనిపిస్తోంది.. ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడని వెల్లడించారు. దీంతో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కు అభిషేక్ శర్మ అందుబాటులో ఉంటాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాగా అమెరికా జట్టుతో మ్యాచ్ ఆడిన తర్వాత వైరల్ ఫీవర్ బారిన పడ్డాడు అభిషేక్ శర్మ. అయితే, ఆ తర్వాత అభిషేక్ శర్మ కడుపునొప్పితో కూడా బాధపడినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
అందుకే నిన్న జరిగిన రెండవ మ్యాచ్ లో అభిషేక్ శర్మ ఆడలేదు. కానీ డగౌట్ లో కూర్చొని మ్యాచ్ తిలకించాడు. ఈ సందర్భంగా అభిషేక్ శర్మ కాస్త నీరసంగా ఉన్నాడు. మరి అభిషేక్ శర్మ పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ లో ఉంటాడా? లేదా? అనేది చూడాలి. కాగా ఫిబ్రవరి 15వ తేదీన భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఇండియా వరుసగా రెండు మ్యాచ్ లలో విజయం సాధించింది. మొదట అమెరికా నిన్న నమీబియాను చిత్తు చేసింది.






