- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆ అవార్డుకు నామినేట్ అయిన తెలంగాణ బిడ్డ

దిశ, స్పోర్ట్స్ : ఇటీవల మహిళల అండర్-19 టీ20 వరల్డ్ కప్‌లో తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష సంచలన ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. భారత్ వరుసగా రెండోసారి టైటిల్ సాధించడంలో ఆమె కీలక పాత్ర పోషించింది. ఈ నేపథ్యంలోనే త్రిష ఐసీసీ మంత్లీ అవార్డు రేసులో నిలిచింది. జనవరికి సంబంధించి‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డుకు ఆమె నామినేట్ అయ్యింది. శుక్రవారం అవార్డు నామినీలను ఐసీసీ ప్రకటించింది. అండర్-19 టీ20 వరల్డ్ కప్‌లో త్రిష ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసింది. 309 రన్స్‌తోపాటు 7 వికెట్లతో తీసింది. దీంతో ఆమె ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచింది. మంత్లీ అవార్డు కోసం త్రిష సీనియర్ క్రికెటర్లతో పోటీపడటం విశేషం. ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ బెత్ మూనీ కూడా అవార్డు రేసులో ఉంది. అలాగే, వెస్టిండీస్‌కు చెందిన కరిష్మా రామ్‌హరాక్ కూడా పోటీపడుతున్నది.
స్పిన్నర్ వరుణ్ కూడా
పురుషుల విభాగంలో ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు భారత స్పిన్నర వరుణ్ చక్రవర్తి నామినేట్ అయ్యాడు. ఇటీవల ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌లో అతను రాణించాడు. ఐదు మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీశాడు. సిరీస్‌లో అతనే టాప్ వికెట్ టేకర్. మరోవైపు, విండీస్ బౌలర్ వర్రికన్, పాకిస్తాన్ బౌలర్ నొమన్ అలీ కూడా అవార్డు కోసం పోటీపడుతున్నారు.