- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరోసారి రెచ్చిపోయిన వైభవ్ సూర్యవంశీ.. భారీ స్కోరు దిశగా భారత్
మూడో టీ20 మ్యాచ్‌లో భారత యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిపోయాడు.

దిశ, వెబ్ డెస్క్: భారత్, జింబాబ్వే మధ్య హరారే వేదికగా మూడో టీ20 మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన భారత జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కు వచ్చిన 15 ఏళ్ల యువ విధ్వంస బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ జింబాబ్వే బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఓ వైపు అభిషేక్ శర్మ సింగిల్ డిజిట్ కే అవుట్ అయ్యి నిరాశ పరిచినప్పటికి.. వైభవ్ మాత్రం ఫోర్లు, సిక్సర్లతో జింబాబ్వే బ్యాటర్లపై విరుచుకు పడ్డాడు.
కేవలం 31 బంతుల్లో 2 సిక్సర్లు, 6 ఫోర్లతో అర్ధ సెంచరీ నమోదు చేసుకున్నాడు. దీంతో ఆయన తన రెండవ అంతర్జాతీయ టీ20 అర్థ సెంచరీని కూడా ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచులో ఇషాన్ కిషన్ 29 పరుగులకు అవుట్ కాగా వైభవ్ 63, శ్రేయస్ అయ్యర్ 3 పరుగులతో ప్రస్తుతం క్రీజులో ఉండగా.. 12 ఓవర్లకు భారత్ 113 పరుగులు చేసింది. ఈ స్కోర్ ఇలానే కొనసాగితే భారత జట్టు మరో భారీ స్కోరు నమోదు చేసే అవకాశం కనిపిస్తుంది.






