రోహిత్‌, కోహ్లీల‌ను వెన‌క్కి నెట్టిన కుర్ర క్రికెట‌ర్‌

by velandi.Saikiran |

దుమ్ము లేపడంతో వైభవ్ సూర్యవంశీ గురించి తెలుసుకునేందుకు చాలా మంది ప్రయత్నాలు చేశారు. ఈ నేప

రోహిత్‌, కోహ్లీల‌ను వెన‌క్కి నెట్టిన కుర్ర క్రికెట‌ర్‌
X

దిశ‌, వెబ్ డెస్క్‌: భారత జట్టుకు సంబంధించిన వైభవ్ సూర్యవంశీ ( Vaibhav Suryavanshi) మరో చరిత్ర సృష్టించాడు. గూగుల్ ( GOOGLE ) సెర్చ్డ్ లిస్టులో కూడా అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. 2025 సంవత్సరంలో మోస్ట్ సెర్చ్డ్ క్రికెటర్ ఇన్ ఇండియా లిస్ట్ లో మొదటి స్థానం సంపాదించాడు వైభవ్ సూర్యవంశీ. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ తో ఈ కుర్ర క్రికెటర్ వైభ‌వ్ పేరు బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే.

పిన్న వయసులో క్రికెట్ లోకి వచ్చి, దుమ్ము లేపడంతో వైభవ్ సూర్యవంశీ గురించి తెలుసుకునేందుకు చాలా మంది ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలోనే మోస్ట్ సెర్చ్డ్ క్రికెటర్ గా తొలి స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇతని తర్వాత రెండో స్థానంలో ప్రియాన్ష్‌ ఆర్య ఉన్నారు. ఆ తర్వాత మూడో స్థానంలో అభిషేక్ శర్మ ఉండగా, నాలుగో స్థానంలో షేక్ రషీద్ ప్లేస్ సంపాదించుకున్నాడు. అటు జెమిమా రోడ్రిగ్స్ ( Jemimah Rodrigues) కూడా మహిళల వ‌న్డే వరల్డ్ కప్ 2025 నేపథ్యంలో పాపులర్ అయ్యారు. ఇది ఇలా ఉండగా ఐపీఎల్ 2025 టోర్నమెంట్, బోర్డర్ గ‌వాస్కర్ ట్రోఫీ బ‌జ్‌ ఉన్నప్పటికీ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల పేర్లు మాత్రం ఈ మోస్ట్ సెర్చ్డ్ లిస్టులో లేవు.

Next Story