- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టెన్త్ పరీక్షలు రాయనున్న వైభవ్ సూర్యవంశీ
14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ క్రికెట్ కు గ్యాప్ ఇవ్వనున్నాడు. ఈ నెల17వ తేదీ నుంచి పదవ తరగతి పరీక్షలు రాయనున్నారు వైభవ్ సూర్యవంశీ.

దిశ, వెబ్ డెస్క్: భారత కుర్ర క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతి తక్కువ కాలంలోనే సచిన్ టెండూల్కర్ లాగా పాపులారిటీ దక్కించుకున్నాడు వైభవ్ సూర్యవంశీ. ప్రస్తుతం అండర్ 19 భారత జట్టులో కొనసాగుతున్న వైభవ్ సూర్యవంశీ, ఆటకు కొన్ని రోజుల పాటు బ్రేక్ ఇవ్వనున్నాడు. దీనికి ప్రత్యేక కారణం ఉంది. వైభవ్ సూర్యవంశీ ఇక పరీక్షలపై ప్రత్యేక ఫోకస్ చేయబోతున్నాడు. పదవ తరగతి పరీక్షలు రాసేందుకు ఈ డేంజర్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ సిద్ధమయ్యాడు.
పదవ తరగతి పరీక్షలు రాయనున్న వైభవ్ సూర్యవంశీ
అండర్ 19 వన్డే వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ లో సంచలన ఆట తీరును ప్రదర్శించాడు 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ. అలాంటి డేంజర్ ఆటగాడు వైభవ్ సూర్య వంశీ, ఈనెల 17వ తేదీ నుంచి జరిగే సీబీఎస్సీ పదవ తరగతి పరీక్షలు రాయబోతున్నాడు. ఈ మేరకు అతనికి అడ్మిట్ కార్డు కూడా అందించారు. బీహార్ రాష్ట్రానికి చెందిన పోడార్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపల్ నీల్ కిషోర్ సిన్హా ఈ విషయాన్ని బహిర్గతం చేశారు. పరీక్షా హాలు లో సాధారణ విద్యార్థి మాదిరి లాగానే వైభవ్ సూర్యవంశీని ట్రీట్ చేస్తామని... అతనికి స్పెషల్ గా ఎలాంటి సదుపాయాలు ఉండబోవని వెల్లడించారు.
ఇది ఇలా ఉండగా... 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ద్వారా పాపులర్ అయ్యాడు. ఐపీఎల్ టోర్నమెంటులో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున బరిలోకి దిగుతున్నాడు. అతనికి ఓపెనర్ గా అవకాశం వచ్చిన నేపథ్యంలో గత సీజనల్ లో అద్భుతంగా రాణించాడు. దానికి తగ్గట్టుగానే భారత జట్టులో కూడా ఎవరు ఊహించని రీతిలో ఆడుతున్నాడు వైభవ్ సూర్యవంశీ. ఏజ్ తక్కువ ఉంది కానీ, అతని సూర్య కుమార్ యాదవ్ సేనలోకి తీసుకురావాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు.






