- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
13 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ.. ఐపీఎల్ సంచలనం అడుగుజాడల్లోనే..!
by Phanindra |
13 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ బాదేశాడో బిహార్ కుర్రాడు. ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ అడుగుజాడల్లో నడుస్తానంటున్నాడు.

X
దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్‌లో సెంచరీ బాదిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ గుర్తున్నాడా? అతని ఫ్రెండ్, 13 ఏళ్ల అయాన్ రాజ్ అంతకన్నా భయంకరమైన ఇన్నింగ్స్ ఆడాడు. బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో జరిగిన జిల్లాస్థాయి మ్యాచులో 22 సిక్సర్లు, 41 ఫోర్లు బాదాడు అయాన్. 30 ఓవర్ల మ్యాచులో 134 బంతులు ఎదుర్కొని 327 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఏకంగా 220.89 స్ట్రైక్ రేటుతో ప్రత్యర్థి జట్టుకు ముచ్చెమటలు పట్టించాడు. తనకు వైభవ్ చాలా మంచి ఫ్రెండని, తన అడుగు జాడల్లోనే నడవాలని అనుకుంటున్నానని అయాన్ చెప్పాడు. ‘వైభవ్‌తో మాట్లాడినప్పుడల్లా నాకు చాలా స్పెషల్‌గా ఉంటుంది. మేం చిన్నప్పుడు కలిసి ఆడుకునేవాళ్లం. ఇప్పుడు తను చాలా పేరు సంపాదించాడు. నేను కూడా తననే ఫాలో అవ్వాలని అనుకుంటున్నా’ అని అయాన్ వెల్లడించాడు.
Next Story






