వైభవ్ మామూలోడు కాదు.. బౌలింగ్ వేస్తే, వికెట్ రెండు ముక్కలైంది !

by velandi.Saikiran |

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( IPL 2025) నేపథ్యంలో 14 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ (vaibhav suryavanshi) తెరపైకి

వైభవ్ మామూలోడు కాదు.. బౌలింగ్ వేస్తే,  వికెట్ రెండు ముక్కలైంది !
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( IPL 2025) నేపథ్యంలో 14 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ (vaibhav suryavanshi) తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ కారణంగా... అద్భుతమైన సెంచరీ చేసి వెలుగులోకి వచ్చాడు ఈ 14 ఏళ్ల కుర్రాడు వైభవ్. గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య సోమవారం జరిగిన మ్యాచ్ లో అద్భుతమైన సెంచరీ సాధించాడు వైభవ్ సూర్య వంశీ. కేవలం 35 బంతుల్లోనే... సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

దీంతో వైభవ్ సూర్య వంశీ ఒక్కసారిగా... పాపులర్ అయిపోయాడు. అందరూ అతని బ్యాగ్రౌండ్ గురించి సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నారు.. అయితే బ్యాటింగ్ లో దుమ్ము లేపిన వైభవ్ సూర్య వంశీ... తనలో ఉన్న మరో టాలెంట్ బయట పెట్టాడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేయగల సూర్య వంశీ... లెఫ్ట్ హ్యాండ్ తో బౌలింగ్ ( vaibhav suryavanshi Bowling) కూడా చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే... బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్న... సూర్య వంశీ.. వికెట్ కూడా తీశాడు.

నెట్స్ లో బ్యాటింగ్ చేస్తున్న ఓ ప్లేయర్ ను ఔట్ చేయడమే కాకుండా... వికెట్ కూడా విరగొట్టాడు. అతని బౌలింగ్ దెబ్బకు వికెట్ విరిగి, ఎగిరిపడింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా.. మారింది. దీంతో బ్యాటింగ్ ఆడిన.. ఆ క్రికెటర్ కూడా షాక్ అయిపోయాడు. అటు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో... 14 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ... బౌలింగ్ లోనూ అదరగొడుతున్నారని కామెంట్స్ చేస్తున్నారు.


Next Story