- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూఎస్ ఓపెన్ చాంపియన్‌గా ఆయుశ్.. కెరీర్‌లో తొలి టైటిల్ కైవసం
భారత యువ షట్లర్ ఆయుశ్ శెట్టి యూఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ చాంపియన్‌గా నిలిచాడు.

దిశ, స్పోర్ట్స్ : భారత యువ షట్లర్ ఆయుశ్ శెట్టి అదరగొట్టాడు. యూఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ చాంపియన్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్‌లో కెనడా షట్లర్ బ్రియాన్ యాంగ్‌ను మట్టికరిపించి టైటిల్ ఎగరేసుకపోయాడు. ఆయుశ్‌కు ఇదే తొలి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్. టోర్నీ ఆద్యంతం ఆయుశ్ సంచలన ప్రదర్శన చేశాడు. ఫైనల్‌లోనూ అదే జోరు కనబరిచాడు. బ్రియాన్ యాంగ్‌ను 21-18, 21-13 తేడాతో ఓడించాడు. 47 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌ను రెండు గేముల్లోనే సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్‌లో వరల్డ్ టూర్ టైటిల్ గెలిచిన తొలి భారత ఆటగాడు అతనే. మరోవైపు, మహిళా షట్లర్ తన్వి శర్మ ఫైనల్‌లో బోల్తా పడింది. అమెరికాకు చెందిన బీవెన్ జాంగ్ చేతిలో 21-11, 16-21, 21-10 తేడాతో పరాజయం పాలైంది. తన్వి గట్టిపోటీనిచ్చినప్పటికీ ప్రత్యర్థిని నిలువరించలేకపోయింది. నిర్ణయాత్మక మూడో గేములో మ్యాచ్‌ను కోల్పోయి రన్నరప్‌గా సరిపెట్టింది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూరులో ఫైనల్‌కు చేరుకున్న యంగెస్ట్ ఇండియన్‌గా తన్వి ఘనత సాధించిన విషయం తెలిసిందే.






