పంత్ ను మళ్ళీ గెలికిన ఊర్వశి...RCB గెలవాలంటూ !

by velandi.Saikiran |

లక్నో సూపర్ జెయింట్స్ ( Lucknow Super Giants ) ప్రస్తుత కెప్టెన్ రిషబ్ పంత్ ను ( Rishabh Pant ) బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి ర

పంత్ ను మళ్ళీ గెలికిన ఊర్వశి...RCB గెలవాలంటూ !
X

దిశ, వెబ్ డెస్క్: లక్నో సూపర్ జెయింట్స్ ( Lucknow Super Giants ) ప్రస్తుత కెప్టెన్ రిషబ్ పంత్ ను ( Rishabh Pant ) బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా ( Urvashi Rautela) టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( RCB) జట్టుపై కామెంట్స్ చేసి.. వార్తల్లో నిలిచారు బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( IPL 2025) నేపథ్యంలో... తన ఫేవరెట్ జట్లు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, లక్నో అంటూ కామెంట్స్ చేశారు ఊర్వశి రౌటేలా.

ఈ రెండు జట్లకు తన సపోర్ట్ ఉంటుందని... ఇందులో ఏ జట్టు గెలిచినా తనకు సంతోషం అంటూ వ్యాఖ్యానించారు. దీంతో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. లక్నో కెప్టెన్ గా ఉన్న రిషబ్ పంత్ ను టార్గెట్ చేసి కావాలని... ఊర్వశి ఇలా కామెంట్స్ చేసిందని.. సోషల్ మీడియాలో ఆమెకు కౌంటర్ ఇస్తున్నారు. 27 కోట్లు పలికిన రిషబ్ పంత్... ఇప్పటి వరకు ఆడిన ఒక్క మ్యాచ్ లో కూడా పెద్దగా.. ప్రదర్శన చేయలేదు. 27 కోట్లు తీసుకున్న రిషబ్ పంత్.. లక్నో ఆడిన నాలుగు మ్యాచ్ లు కలిపి 27 పరుగులు కూడా పూర్తి చేయలేదు రిషబ్ పంత్.

అయితే ఈ విషయాన్ని గుర్తు చేస్తూ.. లక్నో కప్ గెలవాలని... ఊర్వశి రౌటేలా మాట్లాడుతోందని కొంత మంది అంటున్నారు. రిషబ్ పంత్ వల్ల.. కప్ గెలవడం సాధ్యం కాదని... అతనికి 27 కోట్లు దండగే అని అర్థం వచ్చేలా ఊర్వశి... ఇలా మాట్లాడుతున్నారని కూడా కొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. గతంలో రిషబ్ పంత్ పైన ఉన్న పగను తీర్చుకునేందుకు ఇలా.. వ్యవహరిస్తోందని కూడా చెబుతున్నారు. ఇది ఇలా ఉండగా గతంలో రిషబ్ పంత్ అలాగే ఊర్వశి రౌటేలా ప్రేమించుకుంటున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇద్దరు ఒకే ప్లాట్ లో ఎంజాయ్ చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నారట. ఇక పంత్ కు యాక్సిడెంట్ అయిన తర్వాత... అతని జోలికి వెళ్ళని ఊర్వశి రౌటేలా.. ఇప్పుడు మళ్లీ రెచ్చగొడుతోందని అంటున్నారు.

Next Story