- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరల్డ్ కప్ విన్నర్ దీప్తి శర్మకు డీఎస్పీ పోస్టును ప్రకటించిన యూపీ సీఎం
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కుశాల్ ఖిలాడి యోజన కింద భారత క్రికెటర్ దీప్తి శర్మ యుపి పోలీసులలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డిఎస్పీ)గా నియమితులయ్యారు.

దిశ, వెబ్ డెస్క్: ఉమెన్స్ వరల్డ్ కప్ లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన ఆల్ రౌండర్ దీప్తి శర్మ (Deepti Sharma).. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గెలుచుకున్న విషయం తెలిసిందే. భారత జట్టు వరల్డ్ కప్ గెలవడంతో కీలక పాత్ర పోషించిన ఆమెకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శనతో దేశానికి, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి కీర్తి తెచ్చిన దీప్తిని సీఎం యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) చేపట్టిన “కుశాల్ ఖిలాడీ యోజన” ("Kushal Khiladi Scheme") కింద డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) గా నియమించారు. ఈ నియామకం క్రీడాకారుల ప్రతిభను గౌరవిస్తూ, ప్రభుత్వ సేవల్లో వారికి ప్రోత్సాహం ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది. యుపి పోలీస్ శాఖ దీప్తి నియామకాన్ని “రాష్ట్ర గౌరవం”గా పేర్కొంటూ ఆమెకు హృదయపూర్వక అభినందనలు తెలిపింది. దీప్తి విజయాలు భారత మహిళా క్రికెట్‌కు మాత్రమే కాకుండా, యువతకు ప్రేరణ గా నిలుస్తున్నాయని అధికారులు ప్రశంసించారు.






