- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
RCB: అమ్మకానికి ఆర్సీబీ..క్లారిటీ ఇచ్చిన యాజమాన్యం !
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును ( Royal Challengers Bangalore) అమ్మేస్తున్నారని.. వచ్చే సీజన్ నుంచి.. అసలు

దిశ, వెబ్ డెస్క్: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును ( Royal Challengers Bangalore) అమ్మేస్తున్నారని.. వచ్చే సీజన్ నుంచి.. అసలు కనిపించబోదని... ఇవాళ ఉదయం నుంచి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై తాజాగా బెంగళూరు యాజమాన్యం స్పందించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును అమ్మే సమస్య లేదని.. యాజమాన్యం ప్రకటించినట్లు మరో వార్త వైరల్ గా మారింది.
ఐపీఎల్ 2026 సీజన్ లో ( IPL 2026) RCB టీం కచ్చితంగా ఆడుతుందని.. ఇందులో ఎలాంటి డౌట్ లేదని పేర్కొన్నట్లు మరో వార్త బయటకు వచ్చింది. తమ ఫ్రాంచైజీని అమ్ముతామని వస్తున్న వార్తలను... ఖండించినట్లు తెలుస్తోంది. ఈసారి కప్పు కొట్టాం... మళ్లీ మళ్లీ కొడతామని..RCB యాజమాన్యం ప్రకటించినట్లు కూడా చెబుతున్నారు. అయితే ఈ వార్తల్లో ఎంత మేరకు నిజం ఉందో తెలియదు కానీ... బెంగళూరు జట్టు.. చుట్టే ఇప్పుడు రకరకాల వార్తలు వస్తున్నాయి.
ఇది ఇలా ఉండగా ఇవాళ ఉదయం నుంచి బెంగళూరు జట్టును అమ్మేస్తున్నారని ప్రచారం జోరుగా సాగింది. 16 వేల కోట్లకు జట్టును... ముఖేష్ అంబానీ కుటుంబానికి ( Mukesh Ambani ) అమ్మేస్తున్నట్లు కూడా కొంతమంది ప్రచారం చేశారు. మొన్న బెంగళూరు చిన్న స్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో... ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
🚨 UNITED SPIRITS DIAGEO DENIED ALL REPORTS OF STAKE SALE OF RCB FRANCHISE 🚨
— Tanuj (@ImTanujSingh) June 10, 2025
- The Company Clarifies that reports are speculations and it is not pursuing any such discussions. pic.twitter.com/Ibm1zEZzd3






