పాక్ ప్లేయ‌ర్ల‌కు ఇక బుద్ది రాదు...అంపైర్ పై దాడి ?

by velandi.Saikiran |   (  Updated:2025-09-18 10:43:54  IST  )

యూఏఈ మ్యాచ్ లో అంపైర్ పై దాడి చేసింద‌ని పాకిస్థాన్ పై చ‌ర్చ జ‌రుగుతోంది. యూఏఈ బ్యాటింగ్ చేస్తున్న త‌రుణంలో...అంపైర్

పాక్ ప్లేయ‌ర్ల‌కు ఇక బుద్ది రాదు...అంపైర్ పై దాడి ?
X

దిశ, వెబ్ డెస్క్ : పాకిస్థాన్ ప్లేయ‌ర్ల‌కు బుద్ది రావ‌డం లేదు. రోజుకో వివాదంతో హాట్ టాపిక్ అవుతున్నారు. ముఖ్యంగా ఆసియా క‌ప్ 2025 టోర్న‌మెంట్ లో పాకిస్థాన్ చేస్తున్న ర‌చ్చ‌కు అంద‌రూ అస‌హ్యించుకుంటున్నారు. షేక్ హ్యండ్ వివాదంలో రిఫ‌రీ ఆండీని తొల‌గించాల‌ని పాకిస్థాన్ డిమాండ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా యూఏఈతో మ్యాచ్ కూడా ఆడ‌బోమ‌ని మొండిప‌ట్టు ప‌ట్టింది పాకిస్థాన్‌.

ఇక తాజాగా నిన్న యూఏఈ మ్యాచ్ లో అంపైర్ పై దాడి చేసింద‌ని పాకిస్థాన్ పై చ‌ర్చ జ‌రుగుతోంది. యూఏఈ బ్యాటింగ్ చేస్తున్న త‌రుణంలో...అంపైర్ రుచిరా పల్లియగురుగేకు గాయం అయింది. బౌల‌ర్ వైపు నిల‌బ‌డి ఉన్న అంపైర్ రుచిరా పల్లియగురుగే వైపు పాకిస్థాన్ కీప‌ర్ మహ్మద్ హారీస్ త్రో విసిరాడు. దీంతో అంపైర్ రుచిరాకు గాయం అయింది. దీంతో స్టేడియం వ‌దిలి వెళ్లిపోయాడు రుచిరా. ప్ర‌స్తుతం అత‌డు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడ‌ని అంటున్నారు. ఈ సంఘ‌ట‌న వైర‌ల్ గా మారింది. ఇది చూసిన‌.. భార‌తీయులు దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. క్లిక్

Next Story