- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐపీఎల్ మినీ వేలంలో కీలక ప్లేయర్లకు అనూహ్య షాక్.. కనీస ధరకు కూడా కొనని జట్లు
ఐపీఎల్ 2026 సీజన్ కు సంబంధించిన మినీ వేలం అబుదాబి వేదికగా జరుగుతుంది. ఈ వేలంలో కీలక ప్లేయర్లకు అనూహ్య షాక్ తగిలింది.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్ కు సంబంధించిన మినీ వేలం అబుదాబి వేదికగా జరుగుతుంది. ఈ వేలంలో కీలక ప్లేయర్లకు అనూహ్య షాక్ తగిలింది. గత సీజన్లలో భారీ ధరకు కొన్న జట్లు మినీ వేలంలో మాత్రం వారిని కనీస బేస్ ధరకు కొనుగోలు చేసేందుకు కూడా ఆసక్తి చూపలేదు. దీంతో మినీ వేలంలో అమ్ముడుపోయిన ఆటగాళ్ల కంటే, అమ్ముడుపోని స్టార్ ఆటగాళ్లే అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. అంతర్జాతీయ స్థాయిలో పేరున్న కొందరు కీలక ఆటగాళ్లు, భారత దేశవాళీ స్టార్లు కనీస ధరకు కూడా ఏ ఫ్రాంచైజీ దృష్టిని ఆకర్షించలేకపోయారు.
ఈ జాబితాలో ఇంగ్లాండ్‌కు చెందిన పవర్ హిట్టర్ లియామ్ లివింగ్‌స్టోన్, న్యూజిలాండ్ స్టార్ ఓపెనర్ డెవాన్ కాన్వే, యువ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర వంటి భారీ అంతర్జాతీయ పేర్లు ₹2 కోట్ల కనీస ధరతో ఉన్నప్పటికీ, అమ్మడు కాకపోవడం విశేషం. వీరితో పాటు ఇంగ్లాండ్‌కు చెందిన వికెట్ కీపర్ జానీ బెయిర్‌స్టో, సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ గెరాల్డ్ కోయెట్జీ కూడా అమ్ముడుపోని జాబితాలో చేరారు.
భారత దేశవాళీ స్టార్లకు దక్కని అవకాశం
దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్న భారతీయ ఆటగాళ్లు పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్ కూడా ₹75 లక్షల కనీస ధరకు కూడా కొనుగోలుదారులను కనుగొనలేకపోయారు. అటు ఆకాశ్‌దీప్, ఇటు ఆస్ట్రేలియా బ్యాటర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ కూడా అమ్ముడుపోలేదు. ఇప్పటికే దాదాపు అన్ని జట్లు తమ స్లాట్‌లను ఫిల్ చేసుకుని, పర్స్‌ను ఖాళీ చేసుకుంటున్న నేపథ్యంలో, ఈ స్టార్ ఆటగాళ్లందరికీ యాక్సిలరేటెడ్ రౌండ్‌లో మళ్లీ తమ అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం ఉంది.






