- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎస్కే ఫ్యాన్స్‌కు ఊహించని షాక్.. IPLకు గుడ్‌బై చెప్పిన రవిచంద్రన్ అశ్విన్
టీమిండియా మాజీ ఆటగాడు, స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పేశాడు.

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా మాజీ ఆటగాడు, స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పేశాడు. ఈ మేరకు తన నిర్ణయాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్వీట్టర్) వేదికగా ప్రకటిస్తూ ట్వీట్ చేశాడు. ప్రత్యేకమైన రోజు, అందుకే ఒక ప్రత్యేక ప్రారంభం. ప్రతి ముగింపుకు ఒక కొత్త ప్రారంభం ఉంటుందని అంటారు. నా ఐపీఎల్ క్రికెటర్ జీవితం ఈరోజుతో ముగుస్తుంది. కానీ, వివిధ లీగ్‌లలో క్రికెట్ అన్వేషకుడిగా నా సమయం నేటి నుంచి ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు నాకు లభించిన అద్భుతమైన జ్ఞాపకాలు, అనుబంధాలను మిగిల్చిన అన్ని ఫ్రాంచైజీలకు ధన్యవాదాలు. ముఖ్యంగా నాకు అన్నీ ఇచ్చిన ప్రతి దానికి ఐపీఎల్, బీసీసీఐలకు కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారు. రాబోయే రోజుల్లో ఆనందించడానికి.. ఉత్తమంగా ఉపయోగించుకోవడానికి ఎదురుచూస్తున్నా అంటూ రవిచంద్రన్ అశ్విన్ ట్వీట్ చేశారు.
రవిచంద్రన్ అశ్విన్ తన ఐపీఎల్ కెరీర్‌లో మొత్తం 221 మ్యాచులు ఆడి 187 వికెట్లు, 833 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ రూ.9.75 కోట్లకు రవి అశ్విన్‌ను దక్కించుకుంది. అయితే, 2025 సీజన్‌లో 9 మ్యాచులు ఆడిన రవిచంద్రన్ అశ్విన్ 7 వికెట్లు మాత్రమే తీసి 33 పరుగులు చేశాడు.






