- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్.. పాకిస్తాన్ పై టాస్ గెలిచిన భారత్
అండర్-19 ఆసియా కప్‌లో భాగంగా దుబాయ్‌లోని ఐసీసీ అకాడ గ్రౌండ్‌లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు ఫైనల్‌లో తలపడుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: అండర్-19 ఆసియా కప్‌లో భాగంగా దుబాయ్‌లోని ఐసీసీ అకాడ గ్రౌండ్‌లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు ఫైనల్‌లో తలపడుతున్నాయి. సెమీఫైనల్-1లో శ్రీలంకను 8 వికెట్ల తేడాతో ఓడించి భారత్ ఫైనల్ చేరగా, సెమీఫైనల్-2లో బంగ్లాదేశ్‌పై విజయం సాధించి పాకిస్థాన్ తుది పోరుకు సిద్ధమైంది. ఈ టోర్నీలో ఇప్పటికే రికార్డు స్థాయిలో ఎనిమిది సార్లు ఛాంపియన్‌గా నిలిచిన టీమిండియా, మరోసారి టైటిల్‌ను కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ ఉదయం 10:30 గంటలకు ప్రారంమైంది. కాగా ఈ ప్రతిష్టాత్మక ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో పాకిస్థాన్ జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది.
ఈ టోర్నీలో భారత జట్టు అజేయంగా దూసుకుపోతోంది. ముఖ్యంగా గ్రూప్ దశలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించడం విశేషం. ఆయుష్ మాత్రే నేతృత్వంలోని భారత జట్టులో వైభవ్ సూర్యవంశీ, ఆరోన్ జార్జ్ వంటి బ్యాటర్లు అద్భుతమైన ఫామ్‌లో ఉండగా, బౌలింగ్‌లో దీపేష్ దేవేంద్రన్ 11 వికెట్లతో కీలకంగా మారాడు. మరోవైపు పాకిస్థాన్ జట్టు కూడా తమ బౌలింగ్ విభాగంపై ఆశలు పెట్టుకుంది. రెండు జట్లు బలంగా ఉండటంతో ఈ ఫైనల్ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు అసలైన వినోదాన్ని పంచుతోంది.
ఇండియా U19 ప్లేయింగ్ XI: ఆయుష్ మ్హత్రే(సి), వైభవ్ సూర్యవంశీ, ఆరోన్ జార్జ్, విహాన్ మల్హోత్రా, వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు(w), కనిష్క్ చౌహాన్, హెనిల్ పటేల్, ఖిలాన్ పటేల్, దీపేష్ దేవేంద్రన్, కిషన్ కుమార్ సింగ్
పాకిస్థాన్ U19 ప్లేయింగ్ XI: సమీర్ మిన్హాస్, ఉస్మాన్ ఖాన్, అహ్మద్ హుస్సేన్, ఫర్హాన్ యూసఫ్(సి), హంజా జహూర్(w), హుజైఫా అహ్సన్, నికాబ్ షఫీక్, మహ్మద్ షయాన్, అలీ రజా, అబ్దుల్ సుభాన్, మహ్మద్ సయామ్






